కర్ణాటక క్రైం- ఈ మధ్య కాలంలో సమాజంలో వివాహేతర సంబంధంలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్లను కాదని ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాలు చివరికి కుటుంబాలను చిన్నాబిన్నం చేయడంతో పాటు, ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నా కూడా, వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా కర్ణాటక రాష్ట్రంలోను ఇలాంటి వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేసిన ఘటన శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 26న ఈ హత్య జరిగినా, కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక శివమొగ్గ జిల్లా అచాపుర గ్రామానికి చెందిన 45 ఏళ్ల వినోద్ కుమార్ పక్క ఉరికి చెందిన, ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉంది.
ఈ విషయం వినోద్ భార్యా పిల్లలకు తెలయడంతో పలు మార్లు వారించారు. వివాహితతో అక్రమ సంబంధాని విరమించికోవాలని బెచ్చరించారు. అయినా వినోద్ మాత్రం వినిపించికోలేదు. ఈ క్రమంలో వినోద్ ఇటీవల తమ వ్యవాయ భూమి అమ్మాగా వచ్చిన డబ్బులో పెద్ద మొత్తం వాటాను సదరు మహిళకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ మహిళకు డబ్బులు ఇవ్వవద్దని వినోద్ కుటుంబ సభ్యులు చెప్పిచూశారు. అతను మాత్రం వారి మాటలు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని, వినోద్ ను హత్య చేయాలని కుటుబం సభ్యులు నిర్ణయించుకున్నారు.
పధకం ప్రకారం సెప్టెంబర్ 26న వినోద్ ను ఓ ఇనుప తీగతో గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు. మృతదేహాన్ని కారులో హుణసేకొప్ప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, కారుతో సహా నిప్పంటించారు. అటవీ ప్రాంతంలో కాలిపోయిన కారును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందు వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నారు.
ఐతే వినోద్ భార్య, కొడుకులను విచారించగా, వారి సమాధానాలు పొంతన లేకుండా ఉడటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా, వినోద్ ను తామే హత్య చేశామని వాళ్లు ఒప్పుకున్నారు. ఈ కేసులో నిందితులు వినోద్ భార్య బిను(42), పెద్ద కొడుకు వివేక్(21), చిన్న కొడుకు విష్ణు(19), బిను సోదరి కొడుకు అశోక్(23), వినోద్ సోదరుడు సంజయ్(36)ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.