కొన్ని సార్లు చిన్న పొరపాట్ల కారణంగా నష్టాన్ని ఎదుర్కొవలసి ఉంటుంది. మేలుకొనే సరికి అప్పటికే కొంత మేర డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇది వస్తువునా, మనిషైనా. ఇదే జరిగి సదరు మహిళ విషయంలో.
కొన్ని సార్లు చిన్న పొరపాట్ల కారణంగా నష్టాన్ని ఎదుర్కొవలసి ఉంటుంది. మేలుకొనే సరికి అప్పటికే కొంత మేర డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇది వస్తువునా, మనిషైనా. ఇదే జరిగి సదరు మహిళ విషయంలో. భర్త మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ముగ్గురు పిల్లలు. అందమైన జీవితం. కానీ విధి వీరి కుటుంబాన్ని వెక్కిరించింది. ఉద్యోగ విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న భర్తను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. కుటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె ఇక్కడే ఓ పొరపాటు చేసింది. భర్త ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మృతదేహాన్ని బంధువుల సమక్షంలో ఖననం చేసింది. భర్త చనిపోయిన మూడున్నర నెలల తర్వాత మృతదేహాన్ని బయటకు తీయాలని ఇప్పుడు అధికారులను ఆశ్రయించింది. ఇప్పుడు ఎందుకు అలా చేసిందంటే..?
అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలోని పందివాని పెంటకు చెందిన రేపన చౌడప్ప, శిల్ప భార్యాభర్తలు. చౌడప్ప బెంగళూరులోని విప్రోలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 11న బెంగళూరు నుండి బైక్ పై ఇంటికి వస్తుండగా.. మదనపల్లె రూరల్ మండలంలోని చీకల బైలు వద్ద బండి అదుపు తప్పి పడిపోయాడు. తలకు దెబ్బ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అతడి బెనిఫిట్స్ రావాలంటే పోస్టుమార్టం సర్టిఫికేట్ కావాలని కోరింది సదరు సంస్థ. ప్రమాదకర సంఘటనల్లో పోస్టుమార్టం కీలకమన్న సంగతి తెలియక, చేసిన పొరపాటుకు చింతించింది.
ఈ విషయంపై అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధరరావును కలసి స్పందన కార్యక్రమంలో తన భర్త చౌడప్పకు పోస్టుమార్టం నిర్వహించాలని కోరింది. ఆయన ఆదేశాలతో శుక్రవారం మదనపల్లె డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ, తహశీల్దారు ఎం. భీమేశ్వరరావు పర్యవేక్షణలో సమాధిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీసి.. అక్కడే వైద్యులతో పోస్టు మార్టం నిర్వహించారు. ఈ మొత్తం ఘటనను వీడియోలో చిత్రీకరించారు. పెద్దగా మృతదేహం దెబ్బతినకపోవడంతో వైద్యులు కూడా సులువుగా పోస్టు మార్టం నిర్వహించి రిపోర్టు ఇచ్చారు. భర్త శవానికి పోస్టుమార్టం నిర్వహించాలని స్వయానా భార్యే కోరడం..అందులోనూ మూడన్నర నెలల తర్వాత జరుగుతున్న పోస్టుమార్గం చూడాటానికి పరిసర ప్రాంతాల వారు ఆసక్తిగా తరలివచ్చారు.