స్పెషల్ డెస్క్- హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన, దారుణంగా హత్య చేసిన దుర్మార్గుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యాచార ఘటన తరువాత పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించడం ప్రజలు సైతం అతడి కోసం వెతకడంతో ఒత్తిడి తట్టుకోలేకే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. కానీ రాజును మూడు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకుని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, పైకి మాత్రం ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి భార్య, తల్లి ఆరోపిస్తున్నారు.
ఇక స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్న రాజును అతడి చేతిపై మౌనిక అనే టాటూ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఇంతకీ ఈ మౌనిక ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజు ఒక్కరిని కాదు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజు గతంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన మౌనిక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.
ఐతే కొంత కాలానికే మనస్పర్ధల నేపధ్యంలో గత కొన్ని రోజులుగా ఆమె పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం. ఆ తరువాత రాజు తన మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. రాజు భార్య మౌనిక మాత్రం రాజు అలాంటి వాడు కాదని చెబుతోంది. ఈ పచ్చబొట్టును అతను కొన్నేళ్ల క్రితమే వేయించుకున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. జలాల్ పురంలో ఉంటున్న మహిళను ప్రేమించి పెళ్లి చేసుకొన్న రాజు ఆమె పేరును మౌనికగా మార్చాడని కొందరు అంటున్నారు.
ఐతే మరోవైపు రాజు మేనకోడలు పేరు అని మరికొందరు చెబుతున్నారు. దీంతో అసలు మౌనిక అన్నది రాజు మొదటి భార్య పేరా, రెండో భార్య పేరా, లేక మేనకోడలి పేరా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన మనవ మృగం రాజు ఆత్మహత్య చేసుకోవడంతో చిన్నారి కుటుంబానికి కొంతైనా ఉరట కలిగిందని అంతా భావిస్తున్నారు.