ఇంటర్నేషనల్ డెస్క్- క్రిప్టో కరెన్సీ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా వివాదాలు ఉన్నాయి. అసలు కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని ఆమోదించాలా వద్దా అన్న సంశయం కొనసాగుతోంది. అవడానికి ఆన్ లైన్ లో లావాదేవీలు నిర్వహించినా, క్రిప్టో కరెన్సీ విషయంలో చాలా అనుమానాలున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో మెటా సంస్థ సంచలన తీసుకుంది. వాట్సాప్ సోషల్ యాప్ ద్వారా క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది మెటా.
దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కొంత మంది యూజర్లకు నోవి పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ఐతే ప్రభుత్వాల కంట్రోల్ లేని క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక రంగంలో గందరగోళ పరిస్థితుల నెలకొంటాయవని చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐతే ఇదే సమయంలో రాబోవు రోజులన్నీ క్రిప్టో కరెన్సీదే అని టెక్ సంస్థలు అంటున్నారు. ఎలన్ మస్క్, టిమ్ కుక్ లాంటి టెక్ సంస్థల అదిపతులు క్రిప్టో కరెన్సీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు.
వాట్పాప్ ఈ నేపథ్యంలోనే క్రిప్టో లావాదేవీలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ముందుగా అగ్ర రాజ్యం అమెరికాలో ఎంపిక చేసిన యూజర్ల వాట్సాప్‌లలో నోవి ఫీచర్‌ను జోడించింది. నోవీ ఫీచర్‌లోకి వెళ్లి సంబంధిత సమాచారం అందించాలి. సమాచార గోప్యత పాటించడంతో పాటు ఎండ్ టూ ఎండ్ ఎన్‌స్క్రిప్షన్‌గా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇందులో అమెరికా డాలర్లను ఎంటర్ చేస్తే డిజిటల్ కరెన్సీలోకి మారుతుంది. ఈ పనిని పాక్సోస్ ట్రస్ట్ అనే చట్టబద్ధమైన కంపెనీ నిర్వహిస్తుందని మెటా తెలిపింది.
వాట్పాప్ లోని నోవి వాలెట్ లో ఉన్న మనీ ద్వారా క్రిప్టో కరెన్సీ లావాదేవీలను జరుపుకోవచ్చు. ఆరు వారాల క్రితం ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు మోటా స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి సంబందించి ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీలను మెటా నిశితంగా పరిశీలిస్తోంది. క్రిప్టో లావాదేవీలను మరింత మెరుగు పరచడంపై మెటా దృష్టి సారించిందని తెలుస్తోంది.