ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవటానికి ఫిజీ దేశంలోని యువకులు తిమింగలం దంతాన్ని బహుమతిగా ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 300లకుపైగా ఉన్న ద్వీప సముదాయాల్లో ఈ ఆచారం అమల్లో ఉంది.
ప్రేమ ఎప్పుడు? ఎలా? ఎవరి మధ్య పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. వాస్తవానికి ప్రేమ ఓ మత్తు మందులాంటిది. ప్రేమ మత్తులో ఉన్నపుడు మనం ప్రేమించిన వారి కోసం ఎంతటి కష్టమైన పనైనా సరే చేయాలనిపిస్తుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా గడపాలనిపిస్తుంది. ప్రేమ ఎప్పుడూ ఈజీగా దొరకదు.. కొన్నిసార్లు కఠినమైన పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో కఠినమైన రూల్స్ ఉంటాయి. కులం, మతం, ఉద్యోగం, డబ్బు ఇలా చాలా విషయాలు పెళ్లి సమయంలో ప్రధానంగా మారతాయి.
కానీ, ఫిజీ దేశంలోని కుర్రాళ్లు తమకిష్టమైన వారిని పెళ్లి చేసుకోవాలంటే.. అత్యంత దారుణమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెద్దలు చెప్పిన ప్రకారం సముద్రంలోకి వెళ్లి తిమింగలం దంతాన్ని తెచ్చి ప్రియురాలికి కానుకగా ఇవ్వాలి. ఈ పరీక్ష చాలా ప్రమాదకరమైనది. తిమింగలం దంతం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఫిజీలో ఉన్న 300కు పైగా ద్వీప సముదాయాల్లో ఈ ఆచారం అమల్లో ఉంది. అందుకే తిమింగలం నుంచి దంతాన్ని తీసుకువచ్చేందుకు యువకులు ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటూ ఉంటారు.
ఎందుకంటే తిమింగలం ఆశామాషీ జీవికాదు. సముద్రంలోని అతి బలమైన జీవి. అలాంటి జీవినుంచి దంతాన్ని తీసుకురావటం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవటమే. ఇక, ఫిజీలో తిమింగలం దంతాన్ని వివాహం వేడుకల్లో మాత్రమే కాకుండా.. పుట్టిన, మరణించిన సమయాల్లో బహుమతిగా ఇస్తూ ఉంటారు. తిమింగలం దంతాలు చాలా విలువైనవిగా ఫిజీ వాసులు భావిస్తారు. అంతేకాదు! మార్కెట్లో తిమింగలం దంతాల విలువ లక్షల్లో ఉంటుంది. అలాంటి తిమింగలం దంతాన్ని ప్రేమించిన వారికి బహుమతిగా ఇవ్వటం గొప్పపని అని వారు భావిస్తారు. మరి, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం ఏకంగా తిమింగలం దంతాన్ని బహుమతిగా ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.