సహనం నశిస్తే.. పిల్లి అయినా పులై తిరగబడుతుంది. ఇక పరిస్థితి చేజారిపోతుందనిపిస్తే ఒంటరి మహిళ అయినా, ఆది పరాశక్తిగా మారిపోతుంది. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా విశాఖలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖ నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో రౌడీయిజం చేసే వారి సంఖ్యఎక్కువ. నగర శివారు ప్రాంతం కావడం, పైగా.. పేదరికం ఎక్కువగా ఉండటంతో రౌడీ మూకల ఆగడాలకి హద్దే లేకుండా పోయింది. ఇలాంటి ఆరిలోవ లోని క్రాంతి నగర్ లో ఓ ఒంటరి మహిళ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె వద్ద కూడా రౌడీలు దందా వసూల్ చేయడం ఆపలేదు.
తాజాగా ఆ దుకాణం వద్దకు రామకృష్ణ అనే యువకుడు ఫుల్ గా తాగి వచ్చాడు. రావడంతోనే డబ్బు కోసం రౌడీయిజానికి దిగాడు. ముందుగా ఆ మహిళ రామకృష్ణకి చాలా వరకు మాటల్లో నచ్చచెప్పి చూసింది. అయినా.., అతనిలో మార్పు రాలేదు. పైగా.., ఆమెపై దుర్భాష లాడి, రౌడీయిజం చెలాయించాడు. ఆ మహిళపై అందరూ చూస్తుండగానే చేయు కూడా చేసుకున్నాడు. దీంతో.., ఆమె సహనం కోల్పోయింది.
అంగడిలో నుండి ఉక్కసారిగా ఆ మహిళ యువకుడి పైకి దూకింది. ఒక్క దెబ్బతో అతన్ని కిందపడేసి నాలుగు దెబ్బలు తగిలించింది. మహిళ ఒక్కసారిగా కళికా రూపం దాల్చడంతో ఆ యువకుడు బిత్తరపోయాడు. చేసేది లేక అక్కడ నుండి జారుకున్నాడు. ఈ సీన్ మొత్తం అక్కడే ఉన్నప్రజలు మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దైర్యంగా రౌడీ ఆట కట్టించిన ఈ మహిళని మాత్రం నెటిజన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. మరి.., చూశారు కదా? ఈ మహిళ ధైర్య సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.