స్పోర్స్ట్ డెస్క్- భారత క్రికెట్ జట్టు టెస్ట్ సారధి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికా కోహ్లీ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి ఆమెకు సంబందించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. దీంతో వామికా కోహ్లీ ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు.
వామికా ఫస్ట్ బర్త్ డే దగ్గరకొస్తున్న నేపధ్యంలో కనీసం అప్పుడైనా ఆమె ఫోటోను అభిమానులతో పంచుకోవాలని సోషల్ మీడియా వేధికగా అభిమానులు రిక్వేస్ట్ చేస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో వామికా ఫోటో తీసేంకుదు ఫోటో గ్రాఫర్లు, అభిమానులు ప్రయత్నించగా మరోసారి విరాట్ వారించారు. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి ఎయిర్ పోర్టుకు బయల్దేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఫోటోలు తీస్తున్న విషయాన్ని గమనించిన విరాట్.. దయచేసి.. పాప ఫొటో మాత్రం తీయకండి.. అని మర్యాదపూర్వకంగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే విరాట్ కోహ్లి హెచ్చరించే సమయానికే అక్కడున్న ఫొటోగ్రాఫర్లు కొందరు వామిక ఫొటో క్లిక్ మనిపించారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ ఫోటోల్లో ఉన్నది వామికేనా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించలేదు. ఐతే కూతురు వామికా మొదటి పుట్టినరోజున భార్యాపిల్లలతో కలిసి సమయం గడపాలని భావించిన విరాట్, ప్రత్యేక అనుమతితో వాళ్లిద్దరినీ తీసుకువెళ్లినట్లు సమాచారం. టీ20 కెప్టెన్సీని వదిలేసిన కోహ్లిని, వన్డే సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.