కొన్ని ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. టెక్నాలజీతో నిండిపోయిన ప్రపంచంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ వింత ఆచారాలతో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
కొన్ని ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. టెక్నాలజీతో నిండిపోయిన ప్రపంచంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ వింత ఆచారాలతో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఎప్పుడో పూర్వ కాలంలో మనం ఇలాంటి ఆచారాలు ఎక్కువగా చూసి ఉంటాం. కానీ ఇప్పుడు ఇలాంటి ఆచారాలకు కాలం చెల్లిందని అందరూ భావించారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అయితే ఈ ఆచారం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఊరంతా కలిసి ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు. వినడానికి షాకింగ్ ఉన్నా..ఇదే నిజం. మరి ఊరందరూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.
ఒక రైతుకి వ్యవసాయమే జీవనాధారం. అలాంటి రైతు తాను వేసిన పొలం పండాలని వర్షం మీదే ఆధారపడతాడు. అయితే వర్షం కోసం వరుణ దేవుడ్ని ప్రార్ధించడం తప్ప మనం ఏమి చేయలేము. కొన్నిసార్లు వర్షం పడొచ్చు, లేకపోతే లేదు. ఇలాంటి సమయంలో పూర్వ కాలంలో ఒక ఆచారాన్ని పాటించేవారు. కప్పలు అరిస్తే వర్షం వస్తుందని నమ్మేవారు. దాంతో కప్పలకు పెళ్లిళ్లు చేసేవారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఇద్దరు అబ్బాయిలకు పెళ్లిళ్లు చేసి వర్షంపై నమ్మకముంచారు. మాండ్య జిల్లాలోని గంగినహళ్లి అనే గ్రామంలో ఏ ఘటన చోటు చేసుకుంది. ఒక అబ్బాయిని పెళ్లి కొడుకుగా, మరొక అబ్బాయిని పెళ్లి కూతురిగా రెడీ చేసి ఊరిలో అందరికీ గ్రాండ్ గా విందు కూడా ఏర్పాటు చేశారు. ఇది రెయిన్ సీజన్ అయినప్పటికీ వర్షాల పడకపోవడంతో ఇలాంటి ఒక విచిత్రకరమైన ఆచారాన్ని పాటించారు. మరి వీరు ఆశించినట్లుగా వర్షం పడుతుందో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.