సాధారణంగా చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ కు ఉన్నంత క్రేజ్ మరేదానికి ఉండదు. ఇక తమ అభిమాన హీరో పలానా డైరెక్టర్ తో సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం అని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. మరి వారి కోరికతో పాటుగా బోనస్ గా మరో బంపర్ ఆఫర్ ప్రేక్షకులు ఇవ్వనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహసన్ హీరోయిన్ గా ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్న చిత్రం ‘సలార్’. 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే? సలార్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నాడన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
‘సలార్’.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి లీకైన ప్రభాస్ ఫోటోలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దాంతో డార్లింగ్ ఈ సారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమేనని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సలార్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? సలార్ మూవీలో హీరో విజయ్ దేవరకొండ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అదీకాక సలార్ సెట్ లో విజయ్ ఫోటో లు ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కు తమ్ముడిగా నటించనున్నాడని సమాచారం.
#VijayDeverakonda From The Sets Of #Saalar ❤️🔥
Sources Are Saying That It’s a Crucial Role As Small Brother For #Prabhas 💥 Which Will Seen At Post Credit Scene Of Chapter 1 & Leading With Multistarar Of Chapter 2 👍@TheDeverakonda #Kushi pic.twitter.com/suDzbx5YU0
— Vi Nay ツ (@TheVinayVD_Fan) November 27, 2022
ఈ క్రమంలోనే సలార్ చాప్టర్ 1లో విజయ్ కొన్ని సీన్లలోనే ఉంటాడని, చాప్టర్ 2లో పూర్తి స్థాయి పాత్రలో డార్లింగ్ కు తమ్ముడిగా మెరుస్తాడని పరిశ్రమ వర్గాల్లో వినికిడి. అటు ప్రభాస్.. ఇటు విజయ్ దేవరకొండను ఒకే ఫ్రేమ్ లో చూడాలని కలలు కన్న అభిమానుల కోరిక తీరబోతుంది. అయితే ఇప్పటి వరకు సలార్ లో విజయ్ నటిస్తున్నాడని చిత్రయూనిట్ ఎక్కడా ప్రకటించలేదు. ప్రస్తుతం రౌడీ బాయ్ కు సంబంధించిన రఫ్ లుక్ మాత్రం వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్.. సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. అటు ప్రభాస్ సైతం సలార్ తో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
Nizam King 👑 nizam Prince#prabhas & #VijayDeverakonda pic.twitter.com/QhpzhjMD8q
— Vijay Sai (@VijaySa45011843) November 27, 2022