ఇండస్ట్రీలో మళ్ళీ వరుస ప్రమాదాలు చోటు చేకుంటున్నాయి. మొన్నటికి మొన్న తమిళ దర్శకుడు, నటుడు చేరన్ షూటింగ్ లో గాయపడి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అంతకముందు తమిళ హీరో విశాల్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఇవన్నీ మరచిపోకముందే.. తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ కి తాజాగా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. చెన్నైలోని ధనుష్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన లొకేషన్‌లో గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. దెబ్బ బలంగా తగలడంతో ప్రకాశ్‌రాజ్ చేతికి ఫ్రాక్చర్ అయ్యింది.
ఈ ప్రమాదంపై ట్విట్టర్‌లో ప్రకాశ్‌రాజ్ స్పందించారు. “ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దు. సర్జరీ కోసం నా స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు హైదరాబాద్ వస్తున్నా” అని ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరి.., ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ వరుస ప్రమాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
A small fall.. a tiny fracture.. flying to Hyderabad into the safe hands of my friend Dr Guruvareddy for a surgery. I will be fine nothing to worry .. keep me in your thoughts 😊😊😊🤗🤗🤗
— Prakash Raj (@prakashraaj) August 10, 2021