ఫిల్మ్ డెస్క్- తెరపై తమను చూసుకోవాలని చాలా మంది కలలు కంటారు. నేరుగా వెండితెరపై కొంత మంది తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటే.. మరి కొంత మంది మాత్రం ముందు బుల్లి తెరపై తామేంటో నిరూపించుకుని, ఆ తరువాత వెండితెర కోసం ట్రై చేస్తుంటారు. ఇలా బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వెళ్లి సక్సెస్ అయినవాళ్లు చాలా మంది నటీనటులు ఉన్నారు.
ఇలాంటి వారి గురించి చెప్పుకోవాలంటే అనసూయ, రష్మీ, వర్షిణి, శ్రీముఖి ఇలా బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చినవారే. ఢీ షోతో పాపులర్ అయిన యాంకర్ వర్షిణి ఆ తర్వాత కామెడీ స్టార్స్ షో ద్వారా ఆకట్టుకుంది. తాజాగా వర్షిణికి సమంతతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా వర్షినే చెప్పింది.
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమాలో వర్షిణికి ఛాన్స్ దక్కిందట. అక్కినేని సమంత ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. శాకుంతలం మూవీలో తాను కూడా నటిస్తున్నాననే విషయాన్ని చెప్పింది వర్షిణి. తాను ఎప్పుడూ స్టార్స్‌తో పని చేయలేదని, తొలిసారి సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో తన పాత్ర మల్టిపుల్ లుక్‌తో ఉంటుందని, గుణశేఖర్ లాంటి పెద్ద డైరెక్టర్ తో పని చేయడం తన అదృష్టమని ఉప్పొంగిపోయింది వర్షిణి. తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న శాకుంతలం సినిమా షూటింగ్‌లో వర్షిణి జాయిన్ అయిందట. మరి ఈ సినిమాతో వర్షిణి ఎంతమేర పేరు తెచ్చుకుంటుందన్నది చూడాలి మరి.