హైదరాబాద్ లోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మహిళ క్రికెటర్ శ్రావణి ఇంటిని GHMC అధికారులు కూల్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు స్పందించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి అనే యువ క్రికెట్.. తండ్రి బి.మల్లేశ్ తో కలసి నివాసం ఉంటుంది. మల్లేశ్ ప్లంబర్ గా ని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో GHMC అధికారులు.. శ్రావణి ఇంటిని కూల్చివేశారు. ఈ క్రమంలో క్రికెటర్ శ్రావణి కుటుంబాన్ని కాంగ్రెస్ వీహెచ్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. క్రికెటర్ శ్రావణి.. ఎస్సీ దళిత యువతి కనుకనే వివక్షత చూపిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కూల్చిన ఇంటిని పరిశీలించిన వీహెచ్.. స్థానిక మున్సిపల్ కమిషనర్ తో స్పాట్ లోనే ఫోన్ చేసి మాట్లాడారు. ఈ యువతికి న్యాయం జరిగే వరకు స్పోర్ట్స్ టీంలతో న్యాయపోరాటం చేస్తామని ప్రకటన చేశారు. రేపు.. కూల్చిన ఇంటి వద్దనే ధర్నా చేస్తామని.. ఆ కుటుంబానికి న్యాయం చేసేవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.