ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం…
గుర్తుందా ఈ పాట. కొన్ని యుగాల ముందు ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణం.. కలియుగంలో కూడా తప్పడం లేదని.., నేటి స్త్రీ ఇంకా అలనాటి సమాజంలోనే బతకాల్సి వస్తుందని వివరించిన పాట. ఇప్పుడు యూపీలో కూడా అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. ఆనాటి కౌరవ మహాసభలో జూడ క్రీడ కారణంగా వస్త్రాపహరణం జరిగితే.., ఇప్పుడు యూపీలోని రాజకీయ ఘర్షణ కారణంగా వస్త్రాపహరణం జరిగింది. లక్నోకు 130కిలోమీటర్ల దూరంలోని లఖింపూర్ ఖేరీలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
యూపీలో ప్రస్తుతం 825 పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల పర్వంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త నామినేషన్ వేయకుండా ప్రత్యర్ధులు అడ్డుకున్నారు. కానీ.., ఆమె దైర్యంగా అందరిని దాటుకుని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుంది.
ఆమె నామినేషన్ వేస్తే.., ఏకగ్రీవం మిస్ అయిపోతుందన్న భయంతో ప్రత్యర్థులు ఆమె చీర కొంగు పట్టి లాగారు. ఊహించని ఈ సంఘటనతో ఆమె షాక్ అయిపోయింది. ఇదే సమయంలో వారు మహిళ చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను సైతం లాక్కున్నారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లేనని సమాజ్‌వాదీ పార్టీఆరోపించింది. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు చెందిన గుండాలు చెలరేగిపోతున్నారు అంటూ అఖిలేష్ యాదవ్ ఈ వీడియోని పోస్ట్ చేయడం విశేషం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
— Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021