పెళ్లిలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ తనే కాబట్టి, చీరల నుండి ఆభరణాల వరకు ప్రతిదీ తనకు నచ్చినట్లుగా తీసుకుంటుంది పెళ్లికూతురు. అందంగా ముస్తాబు కావాలనుకుంటుంది. పెళ్లి అయ్యి అత్తగారింట అడుగుపెట్టే వేళ కోసం ఎదురు చూస్తుంది. అలా ఆశపడిన ఓ వధువుపై నీళ్లు జల్లింది అనారోగ్యం.. దీంతో
జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్లి తంతుపై ఎన్నో ఆశలను పెట్టుకుంటారు వధూవరులు. ఎటువంటి అడ్డంకులు రాకుండా పెళ్లి సజావుగా సాగిపోవాలని కోరుకుంటారు వారి తల్లిదండ్రులు, వధూవరులు. అయితే పెళ్లి ఫిక్స్ కాగానే.. ఎన్నో కలలు కంటుంది పెళ్లికూతురు. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ తనే కాబట్టి, చీరల నుండి ఆభరణాల వరకు ప్రతిదీ తనకు నచ్చినట్లుగా తీసుకుంటుంది. అందంగా ముస్తాబు కావాలనుకుంటుంది. పెళ్లి అయ్యి అత్తగారింట అడుగుపెట్టే వేళ కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి ఆశలనే మూట గట్టుకుని పెళ్లి పీటలు ఎక్కాలని భావించిన ఓ కుమార్తెకు షాకింగ్ విషయం తెలిసింది. దీంతో తన పెళ్లి ఆగిపోతుందని భావించింది. ఆ విషయాన్ని పెళ్లి కుమారుడికి కూడా తెలిపింది. అతడు పెళ్లి చేసుకున్నాడా లేదో పూర్తిగా చదివేయండీ మరీ..
సరిగ్గా వారం రోజుల్లో పెళ్లి ఉందనగా, పెళ్లి కుమార్తె ఆసుపత్రి పాలు అయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన వైద్యులు ఆమెకు పేగులు పాడైపోయాయని, సర్జరీ చేయాలని చెప్పారు. దీంతో పెళ్లి మీద ఆశలు వదులుకుంది. ఈ విషయం పెళ్లి కుమారుడికి తెలిపింది. ఆమెకు పెళ్లి కుమారుడు షాక్ నిస్తూ వివాహామాడేందుకు ముందుకు వచ్చాడు. ఈ ఘటన రాయ్ పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన లక్ష్మి అనే యువతికి గత గురువారం శక్తి జిల్లాకు చెందిన రాజ్‌తో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే పెళ్లికి వారం రోజుల ముందు లక్ష్మి అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పెద్ద పేగులు పాడైపోయాయని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు.
దీంతో తీవ్ర నిరాశకు గురైన పెళ్లి కుమార్తె.. తన పెళ్లిపై పూర్తిగా ఆశలు వదులుకుంది. ఇక ఈ పెళ్లే కాదూ.. తనకెప్పటికీ పెళ్లి కాదనే డిసైడ్ అయిపోయింది. ఇక ఈ విషయాన్ని పెళ్లి కుమారుడికి చెప్పారు. అయితే వరుడు రాజ్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇంకా ఆమెకు ధైర్యం చెప్పి.. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. చెప్పడమే కాదూ.. హాస్పిటల్ లోనే బెడ్ పైనే వివాహం చేసుకుందామా అంటూ ఆమెకే ప్రతిపాదన పెట్టాడు. దీంతో ఆనందంలో మునిగి తేలిన లక్ష్మీ.. వెంటనే అంగీకరించింది. లక్ష్మి, ఆమె కుటంబ సభ్యులు ఎంతో సంతోషించి ఆసుపత్రి యాజమాన్యానికి విషయం చెప్పారు. యాజమాన్యం ఎంతో సంతోషించి వారి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు హాస్పిటల్‌లోనే చేశారు. బెడ్ పైనే ఆమెకు రాజ్ తాళి కట్టాడు. అక్కడే ఆమెతో కలిసి ఏడడుగులు వేశాడు. ప్రస్తుతం ఈ పెళ్లి అత్యంత చర్చనీయాంశంగా మారింది.
— Hardin (@hardintessa143) April 22, 2023