హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే తల్లీ, కూతుళ్లు మార్నింగ్ వాక్ కు వెళ్లారు. ఓ కారు ఓవర్ స్పీడ్ లో వచ్చి అక్వాకడ ఉన్న నలుగురిని ఢీకొట్టింది. నలుగురిలో తల్లీ, కూతుళ్లు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నిత్యం మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఎన్నో నిండు జీవితాలు బలవుతున్నాయి. అతివేగం అనర్దదాయకం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అయినా కూడా రోజురోజుకు ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ జరుగుతున్నప్పటికీ మద్యం మత్తులో వాహనాలతో రోడ్డు మీదకు వస్తుంటారు. ఇష్టానుసారంగా వాహనాలను నడిపి ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. . తాజాగా హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన కారు ప్రమాద ఘటనలో తల్లీ, కూతుళ్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ ప్రమాదం జరిగిన తర్వాత కారును వదిలి వెళ్లిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన ఈ ఘటన రెండు కుటంబాలను విషాదంలోకి నెట్టేసింది. బండ్లగూడ సన్‌సిటీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వాకర్స్ పైకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఉదయాన్నే తల్లీ కూతుళ్లు వాకింగ్‌కి వెళ్లారు. వారు వాకింగ్ చేస్తుండగా ఓ కారు మృత్యువు రూపంలో వచ్చి వారి ప్రాణాలను హరించివేసింది. అతివేగం, నిర్లక్ష్యం తల్లీ, బిడ్డల ప్రాణాలను తీసింది. మరో ఇద్దరిని మృత్యువు అంచున నిలబెట్టింది. రోడ్డుపై వెళ్లాల్సిన కారు ఫుట్‌పాత్ మీదుగా వెళ్లి నలుగురిని ఢీకొని.. చెట్లపొదల్లోకి వెళ్లి ఓ చెట్టును ఢీకొట్టి ఆగింది. లేకపోతే ఇంకా ఎంత బీభత్సం జరిగేదో.. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఫుట్‌పాత్ పై వస్తున్న నలుగురిని ఢీకొట్టింది. ఇద్దరు తల్లీ, కూతుళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో చనిపోయిన మహిళలను అనురాధ, మమతగా గుర్తించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారులో తల్వార్ లభించింది. ప్రమాదానికి గురైన కారులో మారణాయుధాలు ఉండడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడి వివరాలు గుర్తింపు కొనసాగిస్తున్నారు. నిందితుని కోసం మైలాన్ దేవ్ పల్లిలో మూడు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం తల్లీ, బిడ్డల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.