బిజినెస్ డెస్క్– షేర్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. చాలా మంది షేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతుంటారు. ఐతే స్టాక్ మార్కెట్ లో కొంత మంది డబ్బులు సంపాదిస్తే, మరి కొంత మంది డబ్బులు పోగొట్టుకుంటారు.
షేర్ మార్కెట్ లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తుంటాయి. అందుకే స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. ఇక స్టాక్ మార్కెట్‌లో చాలా కంపెనీల షేర్లు ఉంటాయి. అయితే అన్ని షెర్లు ఒకే రకమైన రాబడిని అందించవు. కొన్ని షేర్లు కళ్లుచెదిరే రాబడిని అందిస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో గోపాల్ పాలీప్లాస్ట్ కూడా ఒకటి.
గోపాల్ పాలీప్లాస్ట్ షేరు గత సంవత్సర కాలంలో 4.45 రూపాయల స్థాయి నుంచి ఏకంగా 998.45 రూపాయల స్థాయికి చేరుకుంది. అంటే గోపాల్ పాలీప్లాస్ట్ షేరు ధర గత సంవత్సర కాలంలో ఏకంగా 22,300 శాతం పెరిగిందన్నమాట. ఈ షేరులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని వేరే చెప్పక్కర్లేదు. వాళ్లంతా కనీవినీ ఎరుగని రాబడి పొంది ఉంటారు. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిసిందన్నమాట.
ఉదాహరణకు గోపాల్ పాలీప్లాస్ట్ షేరులో సంవత్సరం క్రితం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే, ఇప్పుడు వీరి ఇన్వెస్ట్ మెంట్ విలువ ఏకంగా 2.24 కోట్లుగా అయ్యి ఉండేది. ఏడాదిలోనే ఈ స్థాయి రాబడి అంటే మామూలు విషయం కాదు. అంటే లక్ష రూపాయల పెట్టుబడితో కేవలం యేడాదిలో రెండు కోట్ల రూపాయల లాభం అన్నమాట.