స్పెషల్ డెస్క్– బుల్లితెర నటుడు కౌశిక్ తెలుసు కదా.. మొన్న జరిగిన మా ఎన్నికల్లో 18వ ఈసీ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసి గెలిచాడు. ఐతే మా ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశాడు. బ్యాలెట్ బ్యాక్స్ తెరవకుండానే ఎన్నికల ఫలితాలను ప్రకటించేసి అత్యుత్సాహం చూపించిన కొన్ని మీడియా ఛానల్స్‌వ్యవహారశైళిని తప్పుబట్టాడు కౌశిక్.
చైల్డ్ ఆర్టిస్ట్ గా పది సినిమాలకు పైగానే చేసిన కౌశిక్, దాదాపు 36పైగా సీరియల్స్‌లో నటించాడు. ఒక్క ఈటీవీలో వరుసగా 12 సీరియల్స్ చేశాడు. అందం అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు కౌశిక్. ఆరుగురు పతీవ్రతలు, శీను వాసంతి లక్ష్మీ తదితర చిత్రాల్లో నటించాడు. గతంలో టీవీ ఆర్టిస్టుల సమస్యలపై ధర్నాలో పాల్గొని జైలుకి వెళ్లాడు కౌశిక్. అదే సమయంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తనతో పాటు చంచల్ గూడ జైలులోనే ఉన్నారని చెప్తూ తన జైలు అనుభవాలను పంచుకున్నాడు కౌశిక్.
చంచల్ గూడ జైలు జీవితం తన లైఫ్ లో నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పాడు కౌశిక్. ఆ జైలు జీవితం వల్ల అమెరికా వెళ్లే అవకాశం కూడా కోల్పోయానని ఆవేధన వ్యక్తం చేశాడు. తాను జైలులో ఉండే సమయంలోనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కూడా చంచల్ గూడ జైలులో ఉండేవారని గుర్తు చేసుకున్నాడు కౌశిక్. ఐతే జైలులో ఆయనను ఎప్పుడూ కలవలేదని చెప్పాడు. వైఎస్ జగన్ వీఐపీ బరాక్‌లో ఉండేవారని.. తాను జనరల్ బరాక్ లో ఉన్నానని తెలిపాడు.
ఇక చంచల్ గూడ జైలులోకి వెళ్లగానే రిజిస్టర్ లో సంతకం పెట్టించుకుని, లోపలికి తీసుకేెళ్లి బట్టలు విప్పించారని చెప్పుకొచ్చాడు కౌశిక్. ఒంటిపై ఉన్న మొలతాడుతో సహా ఏవైనా తాడులు ఉంటే కట్ చేయించారని అన్నాడు. డార్క్ రూంలో బట్టల్లేకుండా నిలబెట్టి అన్నీ చెక్ చేసేవారని, ఆ సీన్ చూడగానే నాకు మతిపోయిందని చెప్పాడు. ఐతే తన మొహం చూసి గుర్తుపట్టిన కానిస్టేబుల్, డ్రాయల్ వేసుకోమని చెప్పాడని, దాంతో కాస్త రిలీఫ్ అయ్యానని తెలిపాడు కౌశిక్.