ఒక దేశానికి కష్టం వస్తే.., దాని ప్రభావం పక్క దేశాలపై తప్పక ఉంటుంది. ఈ విషయంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న అనిశ్చితి కారణంగా టర్కీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నిజానికి టర్కీకి ఆఫ్ఘానిస్తాన్ తో ఎలాంటి బోర్డర్ లేదు. కానీ.., పక్కనే ఉన్న ఇరాన్ లోకి ఆఫ్ఘానిస్తాన్ ప్రజలు వలస వస్తున్నారు. ఒకవైపు సిరియా సమస్యతో బాధపడుతున్న ఇరాన్ వాళ్ళని శరణార్థులుగా స్వీకరించే పరిస్థితి లేదు. ఒకవేళ ఇరాన్ వారిని సహృదయంతో ఆహ్వానించినా.., ఆఫ్ఘన్ వలస దారులకి పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇరాన్ లో కూడా నిత్యం ఏదో ఒక కారణంతో యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉంటాయి. కాబట్టి.., శాంతిని వెతుక్కుంటూ పక్క దేశానికి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చేరాలి అనుకునేది ఇరాన్ కాదు, ఆ పక్కనే ఉన్న టర్కీ.
టర్కీలో అయితే ప్రశాంతమైన జీవితం దొరుకుతుందని వారి ఆశ. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ వలసలు మరింత ఎక్కువ అయ్యాయి. దీంతో.., టర్కీ అప్రమత్తం అయ్యింది. తమ దేశంలో ఉండే పరిమిత వనరులను శరణార్ధులతో పంచుకోవడం ఇష్టం లేని ఆ దేశ ప్రభుత్వం.. ఇరాన్ తో తమకి ఉన్న 295 కి. మీ బోర్డర్ చుట్టూ ఓ పెద్ద గోడని నిర్మిస్తోంది. గోడ కట్టలేని ప్రాంతాల్లో భారీ ఎత్తులో ఇనుప కంచెలను ఏర్పాటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి., ఈ విషయంలో టర్కీ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
VIDEO: Turkey is building a wall along its border with Iran to prevent a new influx of refugees, mainly from Afghanistan as the Taliban take over the country.
For now, a 5km section is under construction but Turkey is aiming to build a 295km-long wall on its Iranian border pic.twitter.com/YJAZgUOEGa
— AFP News Agency (@AFP) August 17, 2021