కరోనా.. ఈ ఒక్క మాట ప్రపంచంలో చాలా మార్పులకి కారణం అయ్యింది. ఇప్పటికీ ఈ మహమ్మారి దెబ్బకి తలకిందులు అయిన జీవితాలు ఎన్నో. అయితే.., ఇప్పుడు కరోనా కారణంగా ఓ దేశ ప్రధాని పదవే పోయిందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది అక్షరాల నిజం కాబట్టి. ఆ వివరాల్లోకి వెళ్తే.. ట్యూనిషియా దేశంలో కరోనా ఓ రేంజ్ లో విజృంభించింది. ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకుని రావడంలో అక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. ఇప్పటికీ అక్కడ మరణాల రేటు ఎక్కువ ఉండటం, ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయక చర్యలు అందకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఈ నేపధ్యంలో ఆ దేశ ఆరోగ్యశాఖా మంత్రిని ముందుగా తొలగించారు. అయినా.. దేశ ప్రజలు శాంతించలేదు.
పని చేతగాని ప్రధాని దిగిపోవాలని కోరుతూ.., అధికార పార్టీ ఇస్లామిస్ట్ ఇన్‌స్పైర్‌డ్ ఎన్నాహ్‌ద పార్టీ’కి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఆ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. దీంతో.., దేశ అధ్యక్షుడు కైస్ సయీద్ ప్రధానమంత్రి హిచెమ్ మెచిచిని పదవిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌ను రద్దు చేశారు.
ఈ నిర్ణయంపై తాజా మాజీ ప్రధాని అసహనం వ్యక్తం చేశాడు. ఇది దేశ రాజ్యాంగానికి విరుద్ధమైన నిర్ణయం అని, ప్రధానిగా కొనసాగడానికి తనకి అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ.., కావాల్సిన మద్దతు అంతా తనతోనే ఉందంటూ హిచెమ్ మెచిచి తన వాయిస్ వినిపిస్తున్నాడు. కానీ.., అక్కడ ఇప్పుడు ఆయన వాదనని పట్టించుకునే వారే లేదు. మరి.., కరోనా కట్టడిలో విఫలం అయ్యాడని ఏకంగా దేశ ప్రధానినే ఇంటికి పంపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.