ఫిల్మ్ డెస్క్- అయినోళ్ల కంటే ఆస్తులు, పొలం ఎక్కువ కాదు, రక్త సంబంధం విలువేంటో తెలుసుకోరా.. అని అన్నయ్య తమ్ముడికి హితబోద చేయగా, భూ కక్ష్యలు లేని భూదేవిపురం చూడాలన్నది మా నాన్న కోరిక అంటూ తమ్ముడు చెప్పే సమాధానం అదిరిపోయింది. అవును నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ సినిమాలోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
నాని టక్ జగదీష్ మూవీ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. అందాల భామలు రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. నిన్ను కోరి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహంచాడు. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. భూదేవి కొడుకు గురించి ఒక కథ చెప్పాలి.. అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
ట్రైలర్ లో నాయుడుగారి అబ్బాయి టక్ జగదీష్‌గా నాని తన లుక్‌తో, పర్ఫామెన్స్‌తో, ఎమోషనల్ సీన్స్‌తో అదరగొట్టాడు. అయినోళ్ల కంటే ఆస్తులు, పొలం ఎక్కువ కాదు, రక్త సంబంధం విలువేంటో తెలుసుకోరా.. అంటూ అన్న పాత్రలో నటించిన జగపతి బాబు చెప్పగా, భూ కక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక, ఇప్పుడది నా బాధ్యత, నా కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్లే అంటూ నాని పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పాడు.
టక్ జగదీశ్ సినిమాలో.. కుటుంబం అంటే పిచ్చిగా ప్రేమించే హీరోకు ఎదురైన సమస్యలేంటి, అతడి తండ్రి చనిపోవడానికి కారణమేంటి, జగపతి బాబు సినిమాలో విలన్ కాదా.. అన్నది సినిమా చూస్తే తప్ప అర్ధం కాదు. టక్ జగదీశ్ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10న విడుదలవుతోంది. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించిన టక్ జదగీశ్ ను షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు.