ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. బాంబు దాడుల భయంతో పాకిస్థాన్ వెళ్లేందుకు కొన్నేళ్లుగా అన్ని క్రికెట్ టీమ్స్ వణికిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. పాక్ క్రికెట్ బోర్డు కాళ్లావేళ్లా పడటంతో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. గతేడాది పాక్ పర్యటనకు వచ్చింది. కానీ.. మ్యాచ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందే భద్రతా కారణాల దృష్ట్యా, సిరీస్ రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు వచ్చి ఆడాయి. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు ఇంగ్లండ్ 7 టీ20ల సిరీస్ ఆడి.. 4-3తో గెలిచింది. ఇప్పుడు మళ్లీ వరల్డ్ కప్ తర్వాత మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు పాక్‌లో అడుగుపెట్టింది.
భారీ భద్రత నడుమ ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య రావాల్పిండిలో తొలి టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్ మొదలైన రెండు గంటల్లోనే పాకిస్థాన్ పరువు మట్టిలో కలిసింది. సారీ.. సారీ.. పిచ్‌లో కలిసింది. ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు హిస్టారిక్ టెస్టు, హిస్టారిక్ టెస్టు.. అంటూ డంబాచారం చేసిన పాకిస్థాన్, ఏర్పాట్లలో మాత్రం తేలిపోయింది. ప్రపంచ మేటి స్పీడ్ బౌలర్లు తమ జట్టులో ఉన్నారంటూ డాంభీకాలు పలికే పాక్.. మ్యాచ్ కోసం కనీసం స్పీడో మీటర్ సైతం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఏ బౌలర్ ఎంత వేగంతో బౌలింగ్ వేస్తున్నాడో నమోదు చేసే అవకాశం లేకుండా పోయింది. అలాగే డీఆర్‌ఎస్(డిసిషన్ రివ్యూ సిస్టమ్)కూడా అందుబాటులో ఉంచలేదు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. మ్యాచ్‌కు ముందు తెగ హంగామా చేసి.. మ్యాచ్‌లో మాత్రం నూతన టెక్నాలజీ ఏర్పాటు చేయకుండా పరువు పోగొట్టుకుంది. అలాగే మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఆలపించేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి పూర్తిగా లైన్‌లో నిలబడక ముందే వారి నేషనల్ యాంథమ్‌ను ప్లే చేసి.. విమర్శల పాలైంది.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సిమెంట్ పిచ్. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో పాకిస్థాన్ తయారు చేసిన పిచ్ తీవ్ర స్థాయిలో విమర్శలకు గురవుతోంది. ఇది సిమెంట్ పిచ్‌లా ఉందని.. కాదు, కాదు.. ఇది హైవే అంటూ సోసల్ మీడియాలో పాకిస్థాన్ అభిమానులే ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఉపఖండంలో పిచ్‌లకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌తో పాటు స్వింగ్‌కు అనుకూలంగా ఉండాయి. కానీ.. పాక్ రావాల్పిండిలో తయారుచేయించిన పిచ్.. హైవేను తలపిస్తూ.. బాల్ మంచిగా బ్యాట్‌మీదకు వస్తోంది. దీంతో.. మంచి ఊపు మీదున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటున్నారు. టెస్టు మ్యాచ్‌ను వన్డే రేంజ్‌లో ఆడుతూ.. పరుగుల వరద పారిస్తున్నారు. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే(122), బెన్ డకెట్(107) తొలి రోజే సెంచరీల మోతమోగించారు. ఇప్పటికే ఇంగ్లండ్ 55 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 355 పరుగులు సాధించింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ చేసే అవకాశం ఉంది.
What a historic series😂😂😂
No speedometer.
No DRS
Highway road covered with sand and portrayed as pitch.
Visitors falls sick just a day before. 😂😂😂#PAKvsEng @wwasay @Rizzvi73— Ajay Sharma (@TheArchitect96) December 1, 2022
Nasser Hussain “This is an absolute road.” 🥲#PAKvsEng #ENGWAL @TheRealPCB pic.twitter.com/1J73KCyh6a
— Haamizbhatt04 (@HaamizGulzar) December 1, 2022