మాఘమాసంతో పాటు రానున్నదీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎటు చూసినా వివాహాల సందడే నెలకొంది. ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారు అవుతున్నారు. అయితే కేరళలో జరిగిన ఓ వింత పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దేశంలో పెళ్లిళ్లు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే వేలకొలదీ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల పాటు కూడా భాజా భంజత్రీలకు తీరిక ఉండదు. మాఘమాసంతో పాటు రానున్నవనీ పెళ్లిళ్లకు మంచి కాలం కాబట్టి.. తమ ఇంట్లో పెళ్లి ఈడొచ్చిన పిల్లలకు ఓ ఇంటి వారిని చేసే పనిలో పడ్డారు పెద్దవాళ్లు. సంబంధాలు ఖరారు చేసుకుని మంచి ముహుర్తాల కోసం పంతుళ్లను సంప్రదిస్తున్నారు. పెళ్లిళ్ల హడావుడితో కళ్యాణ మండపాలు సైతం కళకళలాడుతున్నాయి. దీంతో దేశంలో ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడే. కానీ కేరళలో వాలంటైన్స్ డే రోజున జరిగిన ఓ పెళ్లి వింతగానూ, ప్రత్యేకంగా నిలిచింది.
వారిద్దరూ అందరీలాంటి వారూ కాదు. విధి రాతకు వంచించబడి, దానితో పోరాటం చేస్తున్నవారు. సమాజం చిన్న చూపుకు గురైనప్పటికీ తాము దేనిలో తీసుపోలేదని నిరూపించారు. వారే కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్స్ ప్రవీణ్ నాథ్, రిషానా ఐషు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఈ జంట ఒక్కటైంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, వీరికో ప్రత్యేకత ఉందండోయ్. పాలక్కడ్‌కు చెందిన ప్రవీణ్ నాథ్ మిస్టర్ కేరళ ట్రాన్స్ జెండర్ 2021 విజేత కాగా, మలప్పురానికి చెందిన రిషానా ఐషు మిస్ మలబార్ ట్రాన్స్ జెండర్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. ఈ ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ మధ్య చిగురించిన ప్రేమ ఎన్నో అవరోధాలను దాటుకుని పెళ్లిపీటలకు చేరింది. ప్రస్తుతం ఈ పెళ్లి వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
వీరూ ట్రాన్స్ జెండర్లుగా మారితేనే అంగీకరించని కుటుంబ సభ్యులు.. వీరి ప్రేమను తొలుత తిరస్కరించారు. ఆ తర్వాత అంగీకరించారు. 18 ఏళ్ల వయసులో ప్రవీణ్ తన ఐడెంటెటీని మార్చుకున్నారు. ప్రవీణ్ కన్నా రిషానా ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే రిషానా ముస్లిం కుటుంబానికి చెందినవారు.రిషానా కుటుంబ సభ్యులు సైతం లింగమార్పిడికి అంగీకరించలేదు. ఐషు వివరించగా.. అప్పుడు అంగీకరించారు. ప్రవీణ్, రిషానా ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలవగా, స్నేహం.. ప్రేమగా మారింది. అప్పటి నుండి వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ నెల 14న పెళ్లి పీటలు ఎక్కారు. ఇటీవల కాలంలో సాధారణ పెళ్లిళ్ల కన్నా ఇలా విభిన్నమైన పెళ్లిళ్లు జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.