ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు ఆ బాధ వర్ణణాతితం. ఇక తండ్రి మరణించిన నెల రోజులకే కొడుకు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇదే ఘటన తాజాగా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇంట్లో అన్నీ చూసుకునే పెద్ద దిక్కు చనిపోతే కుటుంబ సభ్యులకు ఆ బాధ వర్ణణాతితం. అతని మీదే కుటుంబమంతా ఆధారపడి జీవిస్తుంది. అలాంటి మనిషి ఉన్నట్టుండి ఒక్కసారిగా లేడు, ఇక రాడు అనే వార్త.. భార్యాపిల్లలను, కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టేసింది. ఇక తండ్రి మరణించిన నెల రోజులకే కొడుకు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? అచ్చం ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామం. ఇక్కడే అవారి రాజయ్య-లక్ష్మి దంపతుతులు నివాసం ఉంటున్నారు. వీరికి అనిల్, సునీల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇకపోతే గత నెల రోజుల కిందట ఉన్నట్టుండి రాజయ్య గుండెపోటుతో మరణించాడు. అతని మరణవార్తతో భార్య, ఇద్దరు కుమారులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే బుధవారం రాజయ్య నెలమాసికం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి వచ్చారు. అందరూ కలిసి రాజయ్య నెలమాసికం నిర్వహించారు. ఇక మరుసటి రోజు అనిల్ ఏదో పని మీద పెద్దపల్లి జిల్లాకు వెళ్లాడు.
మరో విషాదం ఏంటంటే? ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ వార్త తెలుసుకున్న తల్లి లక్ష్మి, కుటుంభ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నెలరోజుల వ్యవధిలోనే తండ్రి కొడుకులు మరణించడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. తండ్రి నెలమాసికం మరుసటి రోజే కొడుకు మృతి చెందిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.