పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 205 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సంచలన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్టైల్లో సిక్స్‌తో మ్యాచ్ ముగించిన అక్షర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
కాగా అక్షర్ ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. 2014లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన అక్షర్.. అసలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం.. అక్షర్‌కు వాళ్ల నానమ్మ అంటే చాలా ఇష్టం. ఆమెకు కూడా మనవడంటే అమితమైన ప్రేమ. మనవడు ఏం చేసినా సంతోషంతో ఎంకరేజ్ చేసేది. ఈ క్రమంలోనే చిన్నారి అక్షర్ పటేల్ క్రికెట్ ఆడటం చూసి.. మరి నువ్వెప్పుడు క్రికెట్ ఆడుతూ టీవీలో కనిపిస్తామని అడిగేది.
అక్షర్, వాళ్ల నానమ్మ మధ్య ఎప్పుడూ క్రికెట్ గురించే చర్చ. ఇది గమనించిన అక్షర్ వాళ్ల నాన్న.. అక్షర్‌ను క్రికెట్ వైపు ప్రోత్సహించాడు. దీంతో అక్షర్ పటేల్ అండర్ 16 టోర్నీలో ఖోడా తరపున గాంధీనగర్ జట్టుతో ఆడేందుకు అక్కడి వెళ్తాడు. అక్షర్ అక్కడ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే వాళ్ల నానమ్మ హార్ట్ ఎటాక్‌తో చనిపోతుంది. దీంతో నానమ్మ కోరిక తీర్చాలని అక్షర్ వాళ్ల నాన్న అక్షర్ వద్ద మాట తీసుకున్నాడు. నానమ్మ కోరిక తీర్చేందుకు, నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు టీమిండియా తరపున ఆడాలనే దృఢ సంకల్పం తీసుకున్నాడు అక్షర్ పటేల్.
అనుకున్నట్లే 2014లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో అక్షర్ టీమిండియా తరపున అరంగేట్రం చేసి.. నానమ్మ కోరికను తీర్చి, నాన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అప్పటి నుంచి మంచి ప్రదర్శనలే చేస్తున్నా.. జట్టులో నెలకొన్న తీవ్ర పోటీతో పెద్దగా గుర్తింపు పొందలేదు. అలాగే వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆడినట్లు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన గతంలో ఎప్పుడూ చేయలేదు. అక్షర్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ల నాన్న ఎంత ఎమోషనల్ అయ్యారో.. ఈ ఇన్నింగ్స్‌తో అక్షర్ పటేల్ కూడా అంతే ఎమోషనల్ అయ్యాడు.
మ్యాచ్ తర్వాత.. అక్షర్ మాట్లాడుతూ.. ‘దాదాపు ఐదేళ్ల తర్వాత వన్డేలు ఆడుతున్నా.. ఈ ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి ఫామ్‌ను కొనసాగిస్తానని’ అన్నాడు. మరి అక్షర్ పటేల్ టీమిండియాలోకి రావడానికి కారణమైన వాళ్ల నానమ్మ ఈ టైమ్‌లో బతికి ఉంటే ఎంతో సంతోష పడేది. కాగా ఐపీఎల్‌లో అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Axar Patel’s match winning innings last night. Just fantastic, what a knock. pic.twitter.com/rttgpMlmAF
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2022