మనలో చాలా మందికి పోలీసులు అంటే భయం ఉంటుంది. మన తప్పు ఏమి లేకపోయినా.., సామాన్య జనంతో వారు ప్రవర్తించే తీరు చూసి చాలా మందిలో ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. నిజానికి ప్రతి ఖాకీ గుండె అంత కటువుగా ఉండదు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలు పోయినా పర్లేదనుకునే బాధ్యత గల ఉద్యోగం వారిది. వారిలో మానవత్వం మూర్తీభవించే మహానుభావులు కూడా ఉంటారు. ఈ విషయాన్ని ఇప్పుడు అక్షర సత్యం చేశాడు. కరీంనగర్ జిల్లాకి చెందిన కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్. ఇంతకీ ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కరీంనగర్ జిల్లా వన్ టౌన్ కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ డ్యూటీ చేస్తున్న సమయం అది. సరిగ్గా.., అప్పుడే కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన ఎండి అబ్దుల్ ఖాన్ రోడ్డు దాటుతుండగా.., ఓ బైక్ వేగంగా వచ్చి అతన్ని ఢీ కొట్టింది. దీంతో అబ్దుల్ ఖాన్ అక్కడికక్కడే నెలకొరిగిపోయాడు. అందరూ చూస్తుండగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల జనం ఉన్నా.., వారికి ఏమి చేయాలో అర్ధం కాక చూస్తూ ఉండి పోయారు. కానీ.., అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ తెలివిగా ఆలోచించాడు. అపస్మారక స్థితికి కు చేరుకున్న యువకుడు ఛాతిపై ప్రెసింగ్ చేశాడు. అలానే ఆపకుండా నిమిషం పాటు చేయడంతో యువకుడిలో చలనం వచ్చింది. దీంతో.., వెంటనే ఆ యువకుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
కానిస్టేబుల్ యువకుడి ఛాతి పై ప్రెసింగ్ చేసే దృశ్యాలను అక్కడి ప్రజలు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్. దీంతో.., సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ ను సీపీ కమలాసన్ రెడ్డి తో పాటు.., పలువురు అధికారులు అభినందించారు. ఇక ఈ విషయం పట్ల ఎం.ఏ ఖలీల్ కానిస్టేబుల్ స్పందించాడు. బైక్ గుద్దిన వేగానికి ఆ యువకుడు చనిపోయాడని అంతా అనుకున్నారు. కానీ..,ట్రైనింగ్ లో మా సిపి కమలాసన్ రెడ్డి సర్ చెప్పిన మాటలను గుర్తుకి తెచ్చుకుని అతని ఛాతిపై ప్రెసింగ్ చేశాను. దీంతో.., అతని బతికాడని కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ తెలిపారు. ఏదేమైనా.., పోలీసులు అంటే పోలీసులు అంటే భక్షకులు కాదు, రక్షకులు అనే విషయం ఈ ఘటనతో మరోసారి రుజువైంది.