కారు కొనాలి అంటే ఎంత డబ్బు ఉన్నా కూడా.. మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు. కొన్నిసార్లు షోరూమ్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్కోసారి చిన్న చిన్న పనులకు కూడా షోరూమ్ కి వెళ్లాల్సి రావచ్చు. అలా చేయడం వల్ల మీకు డబ్బు మాత్రమే కాదు.. సమయం కూడా వృథా అవుతుంది. ఆ ఇబ్బందులను తొలగించేందుకు టయోటా కిర్లోస్కర్ మోటర్ కొత్త ఆలోచన చేసింది.
సాధారణంగా కారు కొనాలి అనుకోవడంతో సరిపోదు ఆ తర్వాత చాలానే తతంగం ఉంటుంది. మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఖరీదైనా కారు కొన్నా.. కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవు. ఎందుకంటే కారు కొనాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. షోరూమ్ కి వెళ్లాలి అక్కడ మీకు నచ్చిన మోడల్ కారు చూసుకోవాలి. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. దానికి ఒక బ్రోచర్ తీసుకోవాలి. మీకు అన్నీ నచ్చాయి అనుకుంటే డౌన్ పేమెంట్ కట్టి కారుని బుక్ చేసుకోవాలి. ఇదంతా ఒకే రోజు అవుతుందా? అంటే చెప్పలేం. ఒక్కోసారి రెండు, మూడు సార్లైనా షోరూమ్ కి వెళ్లాల్సి రావచ్చు. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టయోటా కిర్లోస్కర్ మోటర్స్ ఒక ఆలోచన చేసింది.
షోరూమ్ కి వెళ్లి మీరు కారు కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు టయోటా కంపెనీ సరికొత్త ఆలోచన చేసింది. నిజానికి దీని వల్ల వారికి మ్యాన్ పవర్, వినియోగదారులకు సమయం రెండూ ఆదా అవుతాయి. ఆ ఆలోచన ఏంటంటే.. ఆన్ లైన్ లోనే మీరు కారుని బుక్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు షోరూమ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ‘వీల్స్ ఆన్ వెబ్’ అని సరికొత్త ప్లాట్ ఫామ్ ని పరిచయం చేశారు. ఈ వెబ్ సైట్ లో టయోటా కంపెనీకి చెందిన ఏ కారైనా మీరు ఆన్ లైన్ లో చూసి చెక్ చేసుకుని కొనుగోలు చేయచ్చు. కారు ఎక్స్ టీరియర్, ఇంటీరియర్, కలర్ ఆప్షన్స్, కస్టమైజేషన్(అవకాశం ఉంటే) ఇలా ఏదైనా మీరు ఆన్ లైన్ లోనే సెలక్ట్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా మీరు చేయాలనుకున్న డౌన్ పేమెంట్ ని కూడా ఆన్ లైన్ లోనే కట్టేయచ్చు. ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్స్, లోన్ సదుపాయాలకు సంబంధించిన అన్ని వివరాలు, సదుపాయాలు ఈ వెబ్ సైట్ లోనే అందుబాటులో ఉంటాయి. మీరు కారు బుక్ చేసిన సమయం నుంచి మీ ఇంటికి డెలివరీ వచ్చే వరకు ప్రతి ఒక్క అప్ డేట్ ని మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తుంటారు. ఈ సదుపాయాన్ని ప్రస్తుతానికి బెంగళూరు వరకు మాత్రమే పరిమితం చేశారు. ఇక్కడ వస్తున్న రెస్పాన్స్ ని బట్టి మిగిలిన సిటీల్లో కూడా ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు. టయోటా కంపెనీ తీసుకొచ్చిన ఈ సదుపాయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటే బావుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Buy a Toyota from the comfort of your couch! Visit the Wheels on Web (WoW) to book, purchase and have your brand-new Toyota car delivered to you.
Visit: https://t.co/YIvxo6ScO5
Currently available only in Bengaluru.#Bengaluru #ToyotaIndia pic.twitter.com/1UeoIi2ieb
— Toyota India (@Toyota_India) April 17, 2023