నేటికాలంలో మనిషిలో సహనం అనేది కనుమరుగయింది. సర్థుకుపోయే గుణం లేకపోడవంతో ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగుతున్నారు. ఈ గొడవలు పెరిగి పెద్దవిగా మారి.. ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద జరిగిన చిన్న ఘర్షణ నలుగురి ప్రాణాలు బలితీసుకుంది. ఈఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని గంజాం జిల్లా హింజిలికాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన ఇద్దరు సోదరుల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. మంగళవారం రాత్రి ఆ ఫాస్ట్ పుడ్ పాయింట్ కి ఓ యువకుడు వచ్చాడు. కస్టమర్ గా వచ్చిన ఆ యువకుడు వారితో వాగ్వాదానికి దిగాడు. వీరి ఇరువురి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈ సోదరులు దుకాణం మూసి వేస్తుండగా ఆ యువకుడు మరికొందరు యువకులతో కలిసి అక్కడి చేరుకున్నాడు. మళ్లీ ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.
ఇది కాస్తా ఒకరిపై మరొకరు దాడులకి దారితీసింది. ఇనుప ఊచలు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు అక్కడిక్కడే చనిపోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.