అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా బంగారం ధర పతనమవుతుంది. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా పసిడి ధర దిగొచ్చింది. అయితే వెండి ధర మాత్రం ఒక్క రోజులో భారీగా పెరిగింది. కానీ వెండి కొనుగోలు చేసిన వారికి ఒక్క రోజులో రూ. 5,500 లాభం వచ్చింది.
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వరుసగా పతనమవుతూ వస్తుంది. నిన్న 1956 డాలర్ల వద్ద కొనసాగిన ఔన్సు స్పాట్ గోల్డ్ ఇవాళ ఉదయం 7:18 గంటలకు 1947.29 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఏకంగా 9 డాలర్లు పతనమైంది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలపై ప్రభావం పడింది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,100 ఉండగా ఇవాళ రూ. 30 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 55,070 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 60,110 ఉండగా ఇవాళ రూ. 40 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60,070 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ధర వద్ద కొనసాగుతోంది. నిన్న ఉదయం ఔన్సు స్పాట్ వెండి 24 డాలర్ల వద్ద ఉండగా ఇవాళ ఉదయం 7:30 గంటలకు 23.87 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్న కిలో వెండి ఏకంగా రూ. 5300 తగ్గగా ఇవాళ అంతే స్థాయిలో పెరిగింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 73,500 ఉండగా ఇవాళ ఉదయం రూ. 5,500 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 79,000 వద్ద కొనసాగుతోంది. నిన్న కిలో వెండి రూ. 73,500 రేటు పెట్టి కొన్నవారికి ఒక్కరోజులో రూ. 5,500 లాభం వచ్చింది. అదే 5 కిలోలు కొని ఉంటే రూ. 27,500 లాభం వచ్చినట్టు. ఇది ఒక్క రోజులో వచ్చిన లాభం. అయితే నిన్న కొనలేని వారు మళ్ళీ తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే మంచి లాభాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ధరల వద్ద కొనసాగుతున్న వెండి తగ్గే అవకాశం ఉంది. బంగారం కూడా మరింత తగ్గే ఛాన్స్ ఉంది.