మొన్నటి వరకు దిగి వచ్చి ఊరట కలిగించిన బంగారం ధర మళ్లీ పెరుగుతుంది. నేనేమి తక్కువ తినలేదని వెండి రుజువు చేసుకుంటుంది. దీనికి కారణం అంతర్జాతీయంగా బంగారం ధరలు మండిపోవడమే. దీంతో మేలిమి పుత్తడి ధర రూ. 60 వేల మార్కుకు మళ్లీ చేరుకుంది.
బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఓ సారి ధరలపై లుక్కేయండి. బంగారం, వెండి రేట్లు తగ్గుతాయన్న ఆశాజనకంతో ఉన్న మహిళలంతా ఉసూరుమనేలా ఆకాశాన్ని తాకుతున్నాయి ధరలు. మొన్నటి వరకు దిగి వచ్చి ఊరట కలిగించిన బంగారం ధర మళ్లీ పెరుగుతుంది. నేనేమి తక్కువ తినలేదని వెండి రుజువు చేసుకుంటుంది. దీనికి కారణం అంతర్జాతీయంగా బంగారం ధరలు మండిపోవడమే. దీంతో మేలిమి పుత్తడి ధర రూ. 60 వేల మార్కుకు మళ్లీ చేరుకుంది. ఇక వెండి అయితే ఏక కాలంలో కిలోపై 2వేలకు పైగా పెరిగి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రూ. 80 వేల దిశగా దూసుకెళుతుంది. ఆషాడ మాసం పూర్తి కాకుండానే ఇలా బెంబేలు పెట్టిస్తున్నాయంటే.. శ్రావణం ఆపై పెళ్లిళ్ల సీజన్ వెరసి రికార్డు స్థాయి ధరలు నమోదు చేస్తాయన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1960 డాలర్ల వద్ద నమోదు అవుతుంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.83 వద్ద ట్రేడవుతుంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లో రూ. 82.0005 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధర తులంపై 380 రూపాయలు, కాసు (8గ్రాములు) రూ. 304 చొప్పున పెరిగింది. ఇక ఆభరణాల తయారీ కోసం వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై రూ. 350 పెరిగి రూ. 55 వేలకు చేరింది. ఎనిమిది గ్రాములపై రూ. 280 ఎగబాకింది. ఇక వెండి అయితే ఢిల్లీలో కిలోపై 2వేలు పెరిగితే.. హైదరాబాద్‌లో మాత్రం రూ. 2,500 పెరగడం గమనార్హం. ఈ రోజు భాగ్యనగరితో సహా తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..