బంగారం ధర మాత్రం పెరిగితే మహిళల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగులు పెడుతుంటాయి. సంవత్సరం తర్వాత కొనుగోలు చేసే బంగారానికి ఈ రోజు నుండే లెక్కలు వేస్తుంటారు. కొనే సమయానికి ఎంత బంగారం ధర పెరగచ్చో ఊహించేస్తుంటారు. పసిడి అంటే మహిళలకు అంత మక్కువ మరీ.
కూరగాయలు ధరలు పెరిగినా, వంటింటి సరుకుల ధరలు ఆకాశాన్ని తాకినా, గ్యాస్ రేటు గుబులు పుట్టిస్తున్నా.. ఆందోళన పడేది కొన్ని రోజులే.. అదే బంగారం ధర మాత్రం పెరిగితే మహిళల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగులు పెడుతుంటాయి. సంవత్సరం తర్వాత కొనుగోలు చేసే బంగారానికి ఈ రోజు నుండే లెక్కలు వేస్తుంటారు. కొనే సమయానికి ఎంత బంగారం ధర పెరగచ్చో ఊహించేస్తుంటారు. పసిడి అంటే మహిళలకు అంత మక్కువ మరీ. అయితే పెళ్లిళ్ల సీజన్లలో పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఆషాడ మాసం సమయానికి కాస్త తగ్గుముఖం కనిపించాయి. ఊరిస్తూ.. ఊరిస్తూ అంతలోనే మళ్లి పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పుంజుకోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
అంతర్జాతీయంగా బంగారం ధర నిన్నటి సెషన్‌తో పోలిస్తే గురువారం 22 డాలర్ల పైనే పెరగడం గమనార్హం. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1960.06 డాలర్లకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఉదయం 9.00 గంటల సమయంలో సిల్వర్ రేటు ఔన్సుకు 24.21 వద్ద ట్రేడవుతుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో బంగారం ధర పెరిగింది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 210 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై రూ. 200 పెరిగింది. సిల్వర్ కిలోపై రూ. 100 తగ్గింది. ప్రస్తుతమైతే సిల్వర్ ధర స్థిరంగానే కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఇంచు మించు ఇదే ధరలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రస్తుతం పది గ్రాముల సిల్వర్ ధర రూ. 770 పలుకుతోంది.