ఏలూరు క్రైం- మన దేశంలో వీదేశీ సంస్కృతి అంతకంతకు పెరుగుతోంది. ఒకప్పుడు ఫారెన్ కంట్రీస్ లో మాత్రమే కనిపించే లింగమార్పిడి ఇప్పుడు భారత్ లో విరివిగా కనిపిస్తోంది. చాలా మంది లిగమార్పిడి చేసుకుని అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతున్నారు. ఇదిగో ఆంధ్రప్రదేశ్ లో పెళ్లై, పిల్లలున్న ఓ వ్యక్తి లింగ మార్పిడి చేసుకోవడంతో, ఆ తరువాత అతని కుటుంబం చిన్నాభినమైంది.
పశ్చిమగోధావరి జిల్లా ఏలూరు బీడీ కాలనీకి చెందిన 22 సంవత్సరాల లక్కపాము సుధారాణి, రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించే సాయిప్రభుని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత సాయిప్రభు లింగమార్పిడి చేయించుకున్నాడు. దీంతో సుధారాణి, 23 సంవత్సరాల తాడి డింపుల్ కుమార్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన ఇద్దరు కుమార్తెలను మాజీ భర్త దగ్గర ఉంచి.. డింపుల్ కుమార్ తో కలిసి ఒక ఇళ్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేయడం మొదలుపెట్టింది సుధారాణి.
ఈ క్రమంలో డింపుల్ కుమార్, సుధారాణిలకు ఒక పాప కూడా పుట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. మధ్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలైన సుధారాణి, డింపుల్ కుమార్ రాత్రి వేళ ఫుల్ గా తాగి బైక్ పై చక్కర్లు కొట్టేవారు. ఈ శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే తాగి బైక్ పై బయకు వెళ్లిన ఇద్దరూ అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తున్న సమయంలో, బైక్ అదుపుతప్పి క్రింద పడిపోయారు. ఈ ప్రమాదంలో సుధారాణి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయింది.
డింపుల్ కుమార్ కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఐతే తన ప్రేయసి మృతి చెందడంతో భయపడిన డింపుల్ కుమార్ బైక్ ను అక్కడే వదిలేసి, ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం రోడ్డుపై పడి ఉన్న సుధారాణిని గుర్తించిన పోలీసులు, ఆమె ఇంటికి వెళ్లగా తలుపులు వేసి ఉన్నాయి. అనుమానం వచ్చి తాళం పగలగొట్టి చూడగా, డింపుల్ కుమార్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.