ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు ఘోరాలకు దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను భర్త అత్యంత దారుణంగా చంపేశాడు.
ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు ఘోరాలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు దంపతులు ఎంత గొడవ పడిన సాయంత్రానికి కలిసి పోయేవారు. అయితే నేటికాలంలో ఎవరికి వారు అహంకారం చూపిస్తూ పంతాలకు పోతున్నారు. ఇంకా దారుణం ఏమింటే భాగస్వామిని హతమార్చేందుకు కూడా కొందరు వెనుకాడటం లేదు. ఇలా క్షణికావేశంలో ఓ వ్యక్తి.. తన భార్యను అత్యంత ఘోరం హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలోని గౌతమీ నగర్ లో శుక్రవారం నాడు దారుణం చోటుచేసుకుంది. గౌతమి నగర్ లో రాజ్ కుమార్, శోభన అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. రాజ్ కుమార్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. హైకోర్టు నాలుగో గేటు వద్ద రాజ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల కొంతకాలం నుంచి ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం మరోసారి వీరిద్దరు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో భార్య గొంతుకోసి వారు నివాసం ఉంటున్న భవనం మొదటి అంతస్తు నుంచి కింద పడేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఎల్‌బీనగర్ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలోని పోలీస్ బృందం ఘటన స్థలాని పరిశీలిస్తున్నారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రాజ్ కుమార్.. శోభతో వాగ్వాదానికి దిగేవాడని స్థానికులు చెబుతున్నారు. అలానే రాజ్ కుమార్ కు వేరే యువతితో అక్రమ సంబంధం ఉండడంతో ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయని మరికొందరు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘోరమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
భార్య గొంతు కోసి బిల్డింగ్ మీద నుండి తోసేసిన పోలీస్ కానిస్టేబుల్
వనస్థలిపురం – గౌతమి నగర్ కాలనీలో దారుణం. హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ తన భార్య శోభని కత్తితో మెడ కోసి మొదటి అంతస్తు నుండి కింద పడేసి దారుణంగా హత్య చేశాడు.
రాజ్ కుమార్ కు వేరే యువతితో… pic.twitter.com/nWRoadEgkf
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2023