ఈ మధ్యకాలంలో కామాంధులు ఎక్కువయ్యారు. ఇలాంటి రాక్షసుల వల్ల బయటకి వెళ్లిన ఆడపిల్ల ఇంటికి తిరిగి వచ్చే వరకు వారి తల్లిదండ్రులు భయంగా గడుపుతుంటారు. సమాజం తలదించుకునేలే అనేక దారుణమైన ఘటనల చోటుచేసుకుంటున్నాయి. 6 ఆరేళ్ల పసి పాప నుంచి 60 ఏళ్ల పండు ముసలావిడ వరకు ఎవరిని వదలకుండా అత్యచారాలకు పాల్పడుతున్నారు కామాంధులు. మరికొందరు అయితే మరి బరితెగించి పశువులపై తమ కామవాంఛ తీర్చుకుని సభ్య సమాజం అసహించుకునేలా చేస్తున్నారు. గతంలో కుక్కపై నలుగురు రేప్ చేసిన ఘటన సంచలనంగా మారింది. తాజాగా రిటైర్డ్ అయిన ఓ 62 ఏళ్ల వ్యక్తి బుద్ది వక్రమార్గం పట్టి.. ఆవుతో శృంగారం చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన ప్రకారం..
విజయనగరంలోని రాజాం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచారం గ్రామానికి చెందిన వ్యక్తి పి. రామకృష్ణ. ఏపీ ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటూ కాలం వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన బుద్ధి వక్రమార్గంలో వెళ్లింది. దీంతో ఆవుతో శృంగారం చేశాడు. అంతటితో ఆగక ఆయన చేసిన ఘనకార్యాన్ని వీడియోను తీశాడు. ఈఘటన సోషల్ మీడియా వైరల్ గా మారి.. చివరకి పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు రామకృష్ణను అరెస్టు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుత పోయే నిజాలు తెలిశాయి.
రామకృష్ణ గత కొన్నేళ్లుగా ఆవులు, పెంపుడు కుక్కలతో అసహజ శృంగారానికి పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ విషయం గురించి నిందితుడి బంధువులకు ముందే తెలిసినా.. వారు మౌనంగా ఉండిపోయారు. పోలీసులకు చెప్పడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయలేదు. పరువు పోతుందనే భయంతో రామకృష్ణ వ్యవహారం బయట పెట్టకపోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే అతనికి ఏమైన మానసిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.
రామకృష్ణ శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నాడని తేలింది. అయితే, అతని చేసే ఈ విచిత్ర ప్రవర్తనకు కారణం ఏంటీ? ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాలేదని పోలీసులు అంటున్నారు. అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.