ఉస్తాద్ రామ్ పోతినేని, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం “ది వారియర్”. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా.. నదియా, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలై.. ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో కృతి శెట్టి మరింత అందంగా కనిపిస్తోందని ఆమె అభిమానులు ఆనందపడుతున్నారు. రామ్ అభిమానులైతే రామ్ సినిమాలో అద్భుతంగా నటించాడని సంబరపడుతున్నారు. అయితే తొలి రోజున రామ్ బాక్సాఫీస్ వద్ద ఎలా సందడి చేశారు? ఏ మేరకు కలెక్షన్స్‌ను రాబట్టుకున్నారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం…
ది వారియర్ మూవీ తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ.8.73 కోట్ల రూపాయల షేర్, 12.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించి.. రామ్ కెరీర్‌లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్‌ను సాధించిన చిత్రంగా రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. ఇక “ది వారియర్” మొదటి రోజు వసూళ్లు ఏరియా వైజ్ చూస్తే..
నైజామ్ – రూ. 1.95 కోట్లు
సీడెడ్ – రూ. 1.06 కోట్లు
ఈస్ట్ – రూ.51 లక్షలు
వెస్ట్ – రూ. 67 లక్షలు
కృష్ణా – రూ. 38 లక్షలు
నెల్లూరు – రూ. 29 లక్షలు
వైజాగ్ – రూ. 1.02 కోట్లు
గుంటూరు – రూ. 1.19 కోట్లు
తమిళనాడు – రూ. 94 లక్షలు
కర్ణాటక – రూ. 32 లక్షలు
రెస్టాఫ్ ది వరల్డ్ – రూ. 41 లక్షలు
మరి వారాంతంలో కీలకమైన శుక్ర, శని, ఆది వారాల్లో రామ్ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా రూ. 38.10కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. మరి.. ది వారియర్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.