‘నువ్వే నా శ్వాస మనస్సున నీకై అభిలాష, బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే, వెతికేది నేనిన్నేనని చెప్పాలని చిన్న ఆశ, ఓ ప్రియతమా’ అంటూ ఒకరికి ఒకరు సినిమాలో పాట ఎంత హిట్టో.. అందులో కనిపించే హీరోయిన్ కూడా అంతే పాపులర్ అయ్యింది.
‘నువ్వే నా శ్వాస మనస్సున నీకై అభిలాష, బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే, వెతికేది నేనిన్నేనని చెప్పాలని చిన్న ఆశ, ఓ ప్రియతమా’ అంటూ ఒకరికి ఒకరు సినిమాలో సాగే పాట ఎంత హిట్టో.. అందులో కనిపించే హీరోయిన్ విరహ వేదనతో కూడిన ఎక్స్ ప్రెషన్ కూడా అంతే పాపులర్. ప్రియుడు (హీరో శ్రీరామ్) కోసం వెతికే ఈ సాంగ్‌లో ఆమె నటనను చూసి బాధపడని వారుండరు. ఈ హీరోయిన్ పేరు అంతగా గుర్తుండకపోవచ్చు కానీ.. ఆమె తెలుగులో పెద్ద హీరోల పక్కన చేసింది. అలాగే ఓ స్పెషల్ సాంగులోనూ ఆడిపాడింది. చేసినవి కొన్ని సినిమాలైనా మంచి పేరు తెచ్చుకుంది. అయితే హిందీలో ఆమె చాలా పాపులర్. కన్నడ, పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది. ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలిస్తే ఔరా అనాల్సిందే.
ఆ నటి పేరు ఆర్తి ఛాబ్రియా. 1982లో ముంబయిలో పుట్టిన ఈ చిన్నది.. మూడేళ్ల వయస్సులోనే యాడ్స్ మోడల్‌గా అడుగుపెట్టింది. ఫారెక్స్ ఆమె తొలి యాడ్. మ్యాగీ, పెప్సోడెంట్, అమూల్ ఐస్ క్రీమ్, ఎల్ఎంఎల్, కళ్యాణ్ జ్యూయలర్స్, నిర్మ, గోల్టీ మసాలా వంటి 300లకు పైగా అడ్వర్టైజ్ మెంట్‌లో నటించింది. అమితాబచ్చన్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద స్టార్ల పక్కన నటించే అవకాశాన్ని సినిమాల్లోకి రాకముందే కొట్టేసింది. 1999లో మిస్ ఇండియా విన్నర్ ఆమె. తెలుగులో ఒకరికి ఒకరు ఆమె తొలి సినిమా అనుకుంటారు కానీ.. అంతక ముందే మధుర క్షణం అనే సినిమాలో మెరిసింది. తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హిందీలో అనేక సినిమాల్లో నటించింది.
2003లో ఒకరికి ఒకరు సినిమాతో ఆమె తెలుగులో పాపులర్ అయ్యింది. సుబ్బలక్ష్మి పాత్రలో అందంగా కనిపించింది. ఆ తర్వాత శ్రీకాంత్, ప్రభుదేవాలతో కలిసి ఇంట్లో శ్రీమతి, వీధిలో కుమారిలో వారిద్దరితో జతకట్టింది. 2008 చింతకాయల రవిలో స్పెషల్ సాంగ్ లో వెంకటేష్ పక్కన మెరిసింది. చివరిగా తెలుగులో నరేష్ మూవీ గోపి (గోడ మీద పిల్లి)లో విలన్ క్యారెక్టర్‌లో కనిపించింది. తర్వాత హిందీ, కన్నడ, పంజాబీ సినిమాలు చేసింది. ముంబయి-వారణాసి ఎక్స్ ప్రెస్ సినిమాతో దర్శకురాలిగా కూడా మారింది. 2019లో ఆస్ట్రేలియాకు చెందిన సీఎ విశారథ్ బీధసీ అనే వ్యక్తిని మనువాడింది. ప్రస్తుతం ఫోటో షూట్స్, విదేశీ ట్రిప్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు కూడా చేస్తుందీ ఈ అమ్మడు. అప్పటికి.. ఇప్పటికీ ఆమెలో ఏ మాత్రం అందం తగ్గలేదు ఆమెలో. అదే క్రేజీ లుక్స్‌లో కనిపిస్తూ.. మెస్మరైజ్ చేస్తుంది.