హైదరాబాద్- పురానాపూల్ వంతెన తెలుసు కదా.. హైదరాబాద్ లో హైకోర్టుకు ఇవతల, ఉస్మానియా ఆస్పత్రికి అవతల మూసీ నదిపై ఉంటుంది. మొన్న వచ్చిన నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల పురానాపూల్ బ్రిడ్జ్ గురించి ఓ సీన్ కూడా పెట్టారు. ఆ పురానాపూల్ వంతెనపై నడుస్తూ దాటిన జంటల ప్రేమ సక్సెస్ అవుతుందంటూ ఓ సెంటిమెంట్ సీన్ పెట్టడంతో ఇప్పుడు ఈ వంతెనపై ప్రేమికుల తాకిడి పెరిగిందట.
బాగా పురాతనమైంది కావడంతో పాటు శిధిలావస్తకు చేరడంతో పురానాపూల్ వంతెెనపై వాహనాల రాకపోకలను నేషెధించారు. ఈ పురానాపూల్ వంతెనకు ఘనమైన చరిత్ర ఉంది. గోల్కొండ రాజధానిగా పరిపాలన చేస్తున్న సుల్తాన్ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా ఈ వంతెనని 1578 లో నిర్మించాడు. యవరాజు మహమ్మద్ కూలీ కుతుబ్ షా ప్రేమించిన భాగ్యమతి ముచికుందా మూసీ నది అవతల వైపు శాలిబండలో అప్పటి చిన్న పల్లెటూరు చించలంలో ఉండేది.
ఆమెను కలుసుకొనేందుకు యువరాజు ప్రతి రోజూ గోల్కొండకి 10 మైళ్ల దూరం పడవలో మూసీనదిని దాటి వెళుతుండటం గమనించిన సుల్తాన్ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా, కొడుకు ప్రేమ కోసం ఈ వంతెనను కట్టించాడట. ఇది ఇద్దరు ప్రేమికుల కోసం కట్టిన వంతెన కావడంతో దీనికి ప్యార్ ఆన పూల్ అని పిలిచేవారు. కాల క్రమంలో పురానాపూల్ గా మారిందని అంటారు. 600 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పుతో 22 ఆర్చిలతో గొప్పగా నిర్మించారు.
ఇంతటి చరిత్ర కలిగిన పురానాపూల్ వంతెనకు పునర్వైభవం తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పురానాపూల్ బ్రిడ్జ్ దుస్థితి మీద ఓ హైదరాబాద్ నెటిజన్ ట్విటర్ లో పోస్టు చేసిన ఫొటోలపై మునిసిపల్ ఎడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్పందించారు. ఎంతో చారిత్రక ప్రాథాన్యత ఉన్న ఆ వంతెనకి పూర్వ వైభవం తీసుకురానున్నట్లు ఆయన ట్విట్టర్ వేధిక ద్వార తెలిపారు. త్వరలోనే పురానాపూల్ బ్రిడ్జ్ ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
#Puranapul is being taken up immediately for bringing back its glory – removing encroachments, pruning wild shrubs, lighting, cleaning, re- carpeting road, properly planning hawker area & creating enough space for sitting / walking
All requested to cooperate
Watch this space https://t.co/18M8CJSXnQ
— Arvind Kumar (@arvindkumar_ias) November 24, 2021