న్యూ ఢిల్లీ- విమానాన్ని పక్షిని చూసి తయారు చేశారన్న సంగతి మనందరికి తెలిసిందే. పక్షి రెండు రెక్కలతో ఆకాశంలో ఎగరడాన్ని చూసిన రైట్ సోదరులు, దాన్ని స్పూర్తిగా తీసుకుని మొట్టమొదటి సారి విమానాన్ని రూపొందించారు. అందుకే విమానానికి సైతం పక్షి లాగే రెండు రెక్కలు ఉంటాయి. ఇక చాలా సందర్బాల్లో ఆకాశంలో పక్షులు ఢీకొట్టడం వల్ల విమానా ప్రమాదాలు జరగడం, కొన్ని సందర్బాల్లో పక్షలు ఢీకొట్టం వల్ల విమానాలు దెబ్బ తినడం వంటి ఘటనలను చూశాం. కానీ ఇప్పుడు ఓ పక్షి వల్ల ఏకంగా ఓ విమానం మధ్యలోంచి వెనక్కి వచ్చేసింది.
అదేంటీ చిన్న పక్షి కారణంగా అంత పెద్ద విమానం వెనక్కి రావడం ఎంటీ అనుకుని ఆశ్చర్యపోతున్నారా.. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్ బయలుదేరింది. తెల్లవారుజామున 2.20 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నెవార్క్ వెళ్లింది. విమానం అరగంట ప్రయాణం తర్వాత మళ్లీ మధ్యలోంచే వెనక్కి వచ్చేసింది. ఇందుకు కారణం ఓ గబ్బిలం. ఢిల్లీ నుంచి బయలుదేరిన కాసేపటికి విమానంలో గబ్బిలం ఉన్న విషయాన్ని గుర్తించారు సిబ్బంది. వెంటనే ఈ విషయాన్ని పైలట్ కు తెలియజేశారు. దీంతో పైలట్ ఈ సమాచారాన్ని ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అందించాడు. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి తీసుకురావాలని ఏటీసీ ఆ విమానం నడుపుతున్న పైలెట్ ను ఆదేశించింది.
దీంతో ఆకాశంలో 25వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని పైలెట్ వెనక్కి తిప్పారు. సరిగ్గా 3 గంటల 55 నిమిషాలకు సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది ఎయిర్ ఇండియా విమానం. దీంతో ప్రయాణికులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత ప్రమాణికులను దించేశాక పరిశీలించగా.. ఆ గబ్బిలం చనిపోయి ఉంది. ఒకటి రెండు రోజుల ముందే ఈ గబ్బిలం విమానంలోకి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐతే విమానంలోకి గబ్బిలం ఎలా వచ్చిందన్నదే అధికారులకు అంతుపట్టడం లేదు. విమానంలోకి ఆహారాన్ని తరలించే కెటరింగ్ వాహనాల ద్వార ఇది వచ్చి ఉందుంటని భావిస్తున్నారు. ఈ ఘటనపై విమానయాన శాఖ విచారణకు ఆదేశించింది.