సంసార సాగరం ఈదడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా ఇద్దరు భార్యల ముద్దుల మొగుళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిందే. భార్యలిద్దరు పరస్పర అంగీకారంతో నడుచుకుంటే పర్వలేదు. ఇద్దరూ పంతానికి, పట్టింపుకులకు పోతే మనోడికి రోజూ మద్దెల దరువే. ఇలాంటివి సినిమాల్లో చూస్తే పగలబడి నవ్వుకుంటారు. థాయ్ లాండ్ కి చెందిన ఓ వ్యక్తి ఒకరు కాదు.. ఇద్దరు కాదు ముగ్గురు కాదు.. ఏకంగా ఎనిమిది మందిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అంతే కాదు ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో హ్యాపీగా కాపురం చేస్తున్నాడు.. వీరిలో ఇద్దరు గర్భవతులుగా ఉన్నారు. టాటూ ఆర్టిస్ట్ ఓంగ్ డ్యామ్ సోరోట్‌కు థాయ్‌లాండ్‌లో ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
థాయ్ సాంప్రదాయ పచ్చబొట్లు వేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఓంగ్ డ్యామ్ సోరోట్ ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లిల్ల గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఎనిమిది మంది భార్యలు తనను ఎంతగానో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారని.. తమది చాలా హ్యాపీ ఫ్యామిలీ అని, తన భార్యలెప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకోరని చెప్పాడు. అంతే కాదు వారు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటారని తెలిపాడు. తన భార్యలకు తెలియకుండా ఏ పని చేయనని.. భార్యలు అంగీకరిస్తేనే మిగితా అమ్మాయిలను పెళ్లి చేసుకున్నట్లు తెలపాడు.
ఇక ఓంగ్ కి పెళ్లి అయ్యిందని తెలిసి కూడా మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారని అతడి భార్యలను ప్రశ్నించగా.. ఓంగ్ చాలా హ్యాండ్ సమ్ గా, కూల్, కేరింగ్ గా ఉంటాడని, అందుకే చూడగానే నచ్చేసి పెళ్లి చేసుకున్నామని సమాధానం ఇచ్చారు. ఈ భూమిపై అత్యంత దయగల, బాధ్యతాయుత భర్త అని ప్రశంసలతో ముంచెత్తారు. అలా అని ఓంగ్ ధనవంతుడు కూడా కాదు.. అందరూ పనులు చేసుకుంటూ జీవినం కొనసాగిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.