కయెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో ఉండే ‘బూన్చుయే’ అనే మగ ఏనుగు, తరచూ ఊరి మీదకు వస్తుంటుంది. అయితే అది ఇప్పటిదాకా వయొలెంట్‌గా ప్రవర్తించలేదని పార్క్ నిర్వాహకులు చెప్తున్నారు. సైలెంట్‌గా వెళ్లి తిండిని తీసుకుంటుందని, ఎవరైనా తరిమినా అక్కడే కూర్చుని మారం చేస్తుందని, జనాలు కూడా ఆ ఆసియా ఏనుగు పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తారని చెప్తున్నారు. వాసన పసిగట్టి ఇళ్లలోకి దూరి కడుపు నిండా లాంగిచేస్తోంది. ఈమధ్య ఓ ఇంటి వంటగది గోడను బద్ధలు కొట్టి గదిలో ఉన్న తిండిని లాగించేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
థాయ్‌లాండ్‌లో చలెర్మ్కియాపట్టణా గ్రామంలో అర్ధరాత్రి దాటాక పై ఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ ఆ ఇంటి యజమాని రాచధవన్ వంటగదిలో గజరాజు నిర్వాకం చూసి షాక్ తింది. ఆ వెంటనే ఆ ఘటనను వీడియో తీసింది. కిచెన్ గోడను అమాంతం పలగొట్టేసిన ఆ గజరాజు తొండాన్ని అక్కడున్న ర్యాకుల్లోకి పోనిచ్చి చిరు తిండ్లను తీసుకుంది. బస్తా బియ్యాన్ని అమాంతం మింగేసింది.
నష్టం లక్ష రూపాయల దాకా ఉందని అధికారులు అంచనా వేశారు. నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ లభించడం రాచధవన్ కి కాస్త ఊరట.
Viral hit of the week!
To license this clip for broadcast or digital use please email licensing@newsflare.cm#viralvideo #wildworld #elephant #thailandnews #viralnews #Trending https://t.co/0FttJCFyCI
— Newsflare (@Newsflare) June 22, 2021