అనంతపురం- హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నియోజకవర్గం హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలయ్య ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో హిందూపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో డంపింగ్ యార్డ్ మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : పుష్పరాజ్ గా.. తొడగొట్టి మరీ డైలాగ్ అదరగొట్టిన బాలయ్య!
హిందూపురంలోని డంపింగ్ యార్డును ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతానికి తరలించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో డంపింగ్ యార్డు తరలింపు తప్ప మరో అభివృద్ధి పనిచేయలేదని టీడీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ చంద్రమౌళీ విమర్శించడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి : ఆగిపోనున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో! కారణం..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వడంలేదని మండిపడుతోంది.ఈ వ్యవహారంలో రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. రెండు వర్గాలు బాలయ్య ఇంటివద్ద చర్చకు సిద్ధమని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో భారీ ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు.