తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి ఈ బుధవారం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. చాలా ఏళ్లుగా కృష్ణ కుమారి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో.. ఆమెను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు.అయితే.., పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం కృష్ణ కుమారి కన్నుమూశారు. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
చెన్నైలోని వీరి స్వస్థలంలో అంత్యమ కార్యక్రమాలు జరగనున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి మరణం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. గవర్నర్ కుటుంబసభ్యులకు స్పీకర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు సైతం తన సంతాపం వ్యక్తం చేశారు.