సజ్జనార్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా, చేసే పనిని శ్రద్దగా చేయడం ఆయనకి అలవాటు. తెలంగాణ అదనపు డీజీపీగా పని చేస్తున్న సమయంలో సజ్జనార్ కి మంచి పేరు వచ్చింది. దిశా కేసుని ఆయన హ్యాండిల్ చేసిన విధానానికి ఆయనకి దేశం అంతా ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. అయితే.. సజ్జనార్ ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆర్టీసీ లో కూడా సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇకపై తెలంగాణ ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్స్ కనిపించకూడదని ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు. అలాగే.., సామాన్య పౌరుడిలా బస్సులో ట్రావెల్ చేస్తూ.. ప్రజల దగ్గర నుండి సలహాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సిబ్బంది పని తీరు ఎలా ఉందొ తెలుసుకుంటున్నారు. ఇక తాజాగా మరోసారి తన మార్క్ చూపించారు సజ్జనార్.
నిమజ్జనం సందర్భంగా ఆయన వినాయకుడిని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకెళ్లారు. బస్సులో ఆయన బంధువులు, సన్నిహితులు కూడా ఉండటం విశేషం. ఈ వినూత్న ఆలోచన.. స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రజలు ఆర్టీసీలో ప్రయాణించడానికి ఇష్టపడేలా చేయడానికే సజ్జనార్ ఇలా సాధారణ పౌరుడిలా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటం విశేషం.