హైదరాబాద్- తెలంగాణలో రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాతలకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. 2018 ఎన్నిక సందర్బంగా లక్ష రూపాయల మేర పంటరుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం కేవలం 25 వేల రూపాయల రుణం ఉన్న రైతలు పంట రుణాలను మాఫీ చేసింది ప్రభుత్వం.
ఇక ఇప్పుడు 50 వేల రూపాయలు బ్యాంకు రుణం ఉన్న రైకుల అప్పులను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 15 నుంచి తెలంగాణ వ్యాప్తంగా 50 వేల రూపాయల మేర పంట రుణాలు ఉన్న రైతుల అప్పులను మాఫీ చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెలాఖరు కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
2019 లో మూడు లక్షల మంది రైతులకు 25 వేల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రస్తుతం 50 వేల రూపాయల లోపు పంట రుణాలను రద్దు చేస్తుడంటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా తెలంగాణలో మొత్తం తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ వర్తించింది. ఇక మిగతా వారికి దశలవారీగా రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.