హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ ప్రారంభించారు. 11.8 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ లైబ్రరీ, ఫొటో గ్యాలరీ, మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం ప్రారంభించారు. 125 అడుగులతో దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 11.8 ఎకరాల విస్తీర్ణంలో, రూ.146.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. విగ్రహావిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. అంబేద్కర్ మ్యూజియం, లైబ్రరీ, ఫొటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక్కడ 2.93 ఎకరాల్లో థీమ్ పార్క్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “అంబేద్కర్ విశ్వమానవుడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆశాదీపం. అంబేద్కర్ ఆశయాలు ఒక ఊరికి, రాష్ట్రానికి పరిమితమయ్యేవి కావు. తెలంగాణ నూతన సచివాలయానికి అబేద్కర్ పేరు పెట్టాం. రోజూ సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనను చూసి ప్రభావితం కావాలి. ఈ విగ్రహం తెలంగాణ కలలను సాకారం చేసే దీపిక. ఇది విగ్రహం కాదు.. విప్లవం. అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలి. అంబేద్కర్ పేరిట ఒక శాశ్వత అవార్డు నెలకొల్పుతాం. దేశంలో ఎవరైతే ఉత్తమ సేవలు అందిస్తారో వారికి వారికి అంబేద్కర్ అవార్డు అందజేస్తాం. ఇందుకు సంబంధించి రూ.51 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం.
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతన అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం ఆవిష్కరించారు.#JaiBhim #JaiTelangana pic.twitter.com/chbmnfeE3I
— Telangana CMO (@TelanganaCMO) April 14, 2023
దానిపై వచ్చే రూ.3 కోట్ల వడ్డీతో ఏటా అంబేద్కర్ అవార్డును ప్రదానం చేస్తాం. ఈ రూ.51 కోట్లు శాశ్వత నిధిగా ఉంటుంది. అంబేద్కర్ కల సాకారం కావాలి. అలాంటి రోజు తప్పకుండా వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పదేళ్ల ముందు వరకు ఉన్న ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రూ.లక్షా 25 వేల 68కోట్లు ఖర్చు చేశాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ లో వచ్చే ప్రభుత్వం మనదే. మన ప్రభుత్వం రాగానే దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే.. ఏటా 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందజేస్తాం. ఈ ఏడాది 1.25 లక్షల మందికి దళిత బంధు ఇవ్వబోతున్నాం. మహారాష్ట్రలో ప్రారంభమైన బీఆర్ఎస్ ప్రభంజనం ఒడిశా, ఉత్తర ప్రదేశ్, బెంగాల్ లో రాబోతోంది” అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Floral Tribute for the pioneer of social justice and architect of Indian Constitution that reflected on the idea of independent modern India, Babasaheb Ambedkar.
CM KCR garu led BRS Government unveils 125-feet tall bronze statue in Hyderabad, today #Ambedkar #JaiBheem pic.twitter.com/3N5HoxTili
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 14, 2023