డాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మోకాలి సర్జరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఓ యువ క్రీడాకారిణి జీవితం అర్థాంతరంగా ముగిసింది. సర్జరీ వికటించి ఆ క్రీడాకారిణి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన తమిళనాడులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని కొలతూర్‌కు చెందిన 17 ఏళ్ల ప్రియ ఇంటర్ చదువుతోంది. ఆమెకు ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. ఫుట్ బాల్ ఆట నేర్చుకుని టోర్నమెంట్‌లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం ఆమె కుడి మోకాలికి గాయం అయింది. దీంతో ఆమెను పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
నవంబర్ 7వ తేదీన అక్కడి వైద్యులు ఆమెకు అర్థోస్కోపీ సర్జరీ నిర్వహించారు. అయితే, ఆపరేషన్ చేసిన చోట రక్తం గడ్డ కట్టడంతో 9వ తేదీ ఆమెను ఆర్‌జీజీజీహెచ్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆమె కుడి కాలిని తొలగించారు. అయితే, మెకాలిలోని మరికొంత పాడైన కణజాలాన్ని తొలగించటానికి సోమవారం మరో సర్జరీని చేశారు. ఇక అప్పటినుంచి ప్రియ స్ప్రహ లేకుండా ఐసీయూలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మృత్యువాతపడింది. ప్రియ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.
మొదటి ఆపరేషన్ జరిగిన తర్వాత ప్రియ మోకాలి దగ్గర నొప్పితో అల్లాడిపోయిందని అన్నారు. నొప్పి అంటూ కేకలు వేసిందని చెప్పారు. డాక్టర్లు ఆ నొప్పికి కారణం అన్వేషించకుండా ప్రియకు నొప్పుల మాత్రలు ఇచ్చి పడుకోబెట్టారని అన్నారు. ఇలా మొత్తం మూడు సార్లు జరిగిందని వివరించారు. ఆ తర్వాతే ప్రియను మరో ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు. తమకు న్యాయం జరగాలంటూ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఇక, ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం ప్రియ చావుకు కారణమైన వైద్యులను ఉద్యోగం నుంచి తొలగించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది.
football player #Priya(17)has been dead due to the negligence of the govt hosp doctors.
Priya during one of her practice sessions….#football #footballplayer #playerpriya #priya #chennai #practicesessions #footballpractice #priyadeath #deathissue pic.twitter.com/i5GJoTgm5F
— Devesh (@Devesh81403955) November 15, 2022