ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘‘వీర సింహారెడ్డి’’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న విడుదల అవ్వనుంది. ఈ నేపథ్యంలో నిన్న ఒంగోల్‌లో ‘‘వీర సింహారెడ్డి’’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ, శృతి హాసన్‌తో పాటు సినిమా టీం మొత్తం పాల్గొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి బాలయ్య హెలికాఫ్టర్‌లో వచ్చారు. నిన్న రాత్రి ఈవెంట్ పూర్తయిన తర్వాత కూడా ఒంగోల్‌లోనే ఉన్నారు. ఈ ఉదయం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. నిన్న వచ్చిన హెలికాఫ్టర్‌లోనే ప్రయాణం మొదలుపెట్టారు. అయితే, కొద్దిదూరం వెళ్లగానే ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో దాన్ని మళ్లీ ఒంగోలులో లాండ్ చేశారు.