టీమిండియా అండర్-19 జట్టు అదరగొట్టింది. ఆసియా కప్‌లో భాగంగా గురువారం దుబాయ్‌లో ఇండియా-యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కుర్రాళ్లు సత్తాచాటారు. టాస్ గెలిచిన యూఏఈ ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఓపెనర్ హర్నుర్ సింగ్ సెంచరీతో కదంతొక్కాడు. 130 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. కెప్టెన్ యష్ కూడా 63 పరుగులతో రాణించాడు.
ఇక గుంటూరు కుర్రాడు ఎస్‌కే రషీద్ కూడా ఈ మ్యాచ్‌లో రాణించాడు. 35 పరుగులతో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక 282 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ 128 పరుగులకే కుప్పకూలింది. కేవలం 34.3 ఓవర్లలోనే టీమిండియా బౌలర్లు యూఏఈ చుట్టేశారు. దీంతో భారత్ 154 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మరి టీమిండియా అండర్ -19 కుర్రాళ్లు సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A solid show with the bat 💪
A fine display with the ball 👍India U19 commence their #U19AsiaCup campaign with a thumping 154-run win over UAE U19. 👏 👏 #INDvUAE
📷:ACC pic.twitter.com/0LyHpPU0tu
— BCCI (@BCCI) December 23, 2021