విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు.. తప్పుడు దోవలో నడుస్తున్నారు. బంగారం భవితవ్యాన్నిచూపిస్తారని నమ్మి తల్లిదండ్రులు, వారి బిడ్డల్ని టీచర్ల చేతిలో పెడుతుంటే.. వారేమో మరో కోణం చూపిస్తున్నారు. విద్యార్థులకు జీవితంలో నిలదొక్కుకునే పాఠాలు బదులు, ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు.
ఆచార్యదేవో భవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రులను గౌరవించాక గురువులనే దేవుళ్లగా కొలుస్తాం. తల్లిదండ్రులు కూడా నేర్పని పాఠాలను గురువే మనకు బోధిస్తారు. చిన్నతనం నుండి ఉపాధి పొందే వరకు మనల్ని ఏదో ఓ సందర్భంలో మార్గనిర్దేశకం చేసేది కూడా గురువే. అటువంటి విద్యాబుద్ధులు నేర్పాంచాల్సిన గురువు.. ఆ వృత్తికే కళంకళం తెచ్చారు. పాఠాలు చెప్పాల్సిన విద్యార్థికి.. ప్రేమ పాఠాలు నేర్పారు. చివరకు ఆ విద్యార్థి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చందా నగర్‌లో ఉంటున్న ఓ మహిళ.. ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. గచ్చిబౌలికి చెందిన బాలుడు అదే పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఈ సమయంలో విద్యార్థికి, ఉపాధ్యాయురాలికి సాన్నిహిత్యం పెరిగింది. అయితే గత నెల 16న వీరిద్దరూ కనిపించకుండా పోయారు. అయితే ఆందోళన చెందిన ఇరు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తన మనవరాలు కనిపించడం లేదంటూ ఉపాధ్యాయురాలి తాత చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. రెండు రోజుల తర్వాత ఆమె తిరిగి వచ్చింది. దీంతో ఆ ఫిర్యాదును వాపస్ తీసుకున్నాడు. ఇటు విద్యార్థి కుటుంబీకులు కూడా గచ్చిబౌలీ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
చివరికి ఎవరింటికీ వాళ్లు చేరుకోగా..ఎక్కడికీ వెళ్లారంటూ కుటుంబ సభ్యులు నిలదీయగా అసలు విషయం బయట పడింది. అటు పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా విద్యార్థితో టీచర్ ప్రేమ వ్యవహారం నడిపినట్లు తేలింది. పది రోజులుగా వారిద్దరూ వివిధ ప్రాంతాలు తిరిగినట్లు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీసులు గుర్తించారు. ఇద్దరికీ పోలీసులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయురాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో వారిలా చేసినట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. పిల్లలకు భవిష్యత్తుకు తగ్గ పాఠాలు నేర్పాల్సిన పంతులమ్మ.. ప్రేమ పాఠాలు నేర్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.