కొత్తగూడెం క్రైం- సమాజంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. క్రైం రేట్ పెరిగిపోతుండటంతో సర్వత్రా ఆందోళన పెరుగుతోంది. అందులోను మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తెలంగాణలో మహిళా ఉపాధ్యాయురాలుపై సహచర టీచర్ దారుణానికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణమైన ఘటన జరిగింది. మహిళా ఉపాధ్యాయురాలిపై సహోద్యోగి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని ములకలపల్లిలో గిరిజన మహిళా ఉపాధ్యాయురాలిపై తోటి ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ ఉపాధ్యాయుడిపై ఆమె ఫిర్యాదు చేసినా విద్యా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
తనపై లైంగిక దాడి చేశాడని టీచర్ పై ఫిర్యాదు చేసి పది రోజులైనా సంబంధింత విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో గిరిజన సంఘాల సహకారంతో విషయం నేరుగా జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేయశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ నిందితుడిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ దారుణమైన ఘటనలో జిల్లా విద్యాశాఖ నిందితుడికి వత్తాసు పలికేలా వ్యవహరించిందని ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్ చొరవతోనే నిందితుడిపై చర్యలు తీసుకున్నారని బాధితులు చెప్పారు. మహిళా ఉపాధ్యాయురాలిపై లైంగిక దాడికి పాల్పడిన టీచర్ పై కేవలం సస్పెన్షన్ వేటు కాకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని బాధితురాలి తరపు వారు డిమాండ్ చేస్తున్నారు.