పన్ను ఎగవేత ఆరోపణలపై ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులకు ఆ ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు గుట్టలుగా కనిపించి షాకిచ్చాయి. వాటిని లెక్కపెట్టగా రూ. 150 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లఖనవూకు చెందిన పీయూష్ జైన్ అనే పర్ఫ్యూమ్ సంస్థ యజమాని పన్ను ఎగ్గొట్టాడనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు అతడి ఇంల్లు, ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజ్, పెట్రోల్ పంప్ లలో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.
పీయూష్ ఇంట్లో రెండు అల్మరాలు తేడాగా కనిపించడంతో వాటిని తెరిచి చూసిన అధికారులు షాక్ అయ్యారు. అల్మరాల నిండ నీట్‌గా ప్యాక్ చేసిన నోట్ల కట్టలు కనిపించాయి. వాటిని బయటకు తీసి లెక్కించగా.. రూ. 150 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిసింది. ఉదయం నుంచి లెక్కించడం ప్రారంభిస్తే.. సాయంత్రానికి గాని ఓ కొలక్కి రాలేదు. పీయూష్ షెల్ కంపెనీల పేరు మీద ఇప్పటికే రూ. 100 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాక కొన్ని రోజుల క్రితమే పీయూష్ సమాజ్‌వాదీ పేరుతో ఓ ప్రత్యేక పర్ఫ్యూమ్ ని కూడా విడుదల చేశాడు. విషయం తెలుసుకున్న జీ ఎస్ టీ అధికారులు కూడా పీయూష్ ఇంటికి చేరుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
समाजवादियों का नारा है
जनता का पैसा हमारा है!समाजवादी पार्टी के कार्यालय में समाजवादी इत्र लॉन्च करने वाले पीयूष जैन के यहाँ GST के छापे में बरामद 100+ करोड़ कौन से समाजवाद की काली कमाई है? pic.twitter.com/EEp7H5IHmt
— Sambit Patra (@sambitswaraj) December 24, 2021